Hyderabad: కీలక ప్రకటన చేసిన నిజాం వారసులు.. ఆ ఆరోపణలు అన్నీ అవాస్తవం అంటూ..
Hyderabad: ఆస్తులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై నిజాం వారసులు స్పందించారు. కీలక ప్రకటన చేస్తూ..
Hyderabad: ఆస్తులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై నిజాం వారసులు స్పందించారు. కీలక ప్రకటన చేస్తూ.. అలాంటిదేమీ లేదని తమపై వస్తోన్న ఆరోపణలు ఖండించారు. గత కొద్ది రోజులుగా నిజాం ఆస్తులు ఆమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం స్పందించిన ఏడవ నిజాం మనవడు దిల్షాద్ జా మీడియా ముందుకు వచ్చారు. నిజాం ఆస్తులు అమ్ముతున్నాననే ఆరోపణల్లో అవాస్తవం లేదని స్పష్టం చేశారు. నిజాం ఆస్తులకు పూర్తి హక్కు దారుడిని తానేనని దిల్షాద్ జా తేల్చి చెప్పారు.
హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్షాద్ జా మాట్లాడుతూ.. కిస్మాతపురలోని దర్గా హజ్రత్ ఖలీజ్ ఖాన్ లో ఉన్న ఐదెకరాల స్థలానికి పూర్తి హక్కు దారుడిని తానేనని తెలిపారు. ఇటీవలి కాలంలో నిజాం అకాఫ్ కమిటీ తాను ఈ స్థలాన్ని అమ్మేస్తున్నానని, ఆ కమిటీకి చెందిన సయ్యద్ ఖాద్రి ఫయిజ్ ఖాన్, ఫాయిజ్ జంగ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తెలిపారు. నిజాం కు చెందిన ఆస్తులను 1984నుండి కాపాడుతున్నానని ఆయన తెలిపారు. నిజాం ఆకాఫ్ కమిటీ అనేది అధికారిక కమిటీ కాదని, పూర్తి నిరాధారమైనదని అన్నారు. ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, తనపై వస్తున్న ఆరోపణల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు దిల్షాద్ జా తెలిపారు.
Also read:
AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..
KRMB Meeting: తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందా?
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..