AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..

AP-TS Weather Alert: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే..

AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..
Ap Weather Report
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2021 | 5:46 AM

AP-TS Weather Alert: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు. అలాగే.. కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం నాడు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యధికంగా జంగమహేశ్వరం లో 77.4 మీ.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కర్నూల్ జిల్లాలో 45.6 మీ.మీ, విశాఖపట్నంలో 14.6 మీ.మీ, నర్సాపూర్ లో 22.9 మీ.మీ, బాపట్ల 20 మీ.మీ , మచిలీపట్నం 12.3 మీ.మీ, అనంతపురం 2.5 మీ.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

తెలంగాణ వాతావరణ సమాచారం.. ఆదివారం నాడు ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గడ్ మీదుగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ద్రోణిలో కలిసిందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

ఆదిలాబాద్, కొమరంభీం, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

Also read:

KRMB Meeting: తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందా?

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..

Shocking News: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ప్రాణాలు కోల్పోయిన 30 మంది చిన్నారులు..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్