KRMB Meeting: తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందా?
KRMB Meeting: నది యాజమాన్య బోర్డుల గెజిట్‌పై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేక వ్యూహాత్మకంగా..
KRMB Meeting: నది యాజమాన్య బోర్డుల గెజిట్‌పై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళనుందా? ఇన్నాళ్లు బోర్డు సమావేశాలకు హాజరుకాని తెలంగాణ సర్కార్.. తాజాగా హాజరవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో సెంట్రల్ గెజిట్ విషయంలో కేసీఅర్ వైఖరిపై అసక్తి నెలకొంది.
రెండు రాష్ట్రాల్లోని భారీ నీటిపారుదల ప్రాజెక్టును నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకొస్తు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ గెజిట్‌లో ఏకంగా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న 106 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర జలవనరుల శాఖ. అయితే కేంద్ర చర్యపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా నిరసన తెలపకపోయినా.. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకురావడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు సీఎం కేసీఅర్.
ఇక కేంద్ర విడుదల చేసిన గెజిట్ అమలులో భాగంగా అక్టోబర్ మెదటికల్లా రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించి షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఎర్పాటుచేస్తున్నాయి మెనెజ్‌మెంట్ బోర్డులు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా జరిగిన ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ సమావేశానికి కూడా హాజరుకాలేదు. ముందుగా పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఎర్పాటుచేసి జలవివాదాలకు పరిష్కారం చూపిస్తేనే హజరవుతామంటు లేఖలు రాశారు తెలంగాణ ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్. ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులతో పాటు, తెలంగాణకు రావాల్సిన వాటాను పెంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ.
అయితే తాజాగా తెలంగాణ సర్కార్ తన నిర్ణయాన్నిమార్చుకున్నట్లు కనిపిస్తోంది. సమావేశాలకు హాజరవుతామంటు ప్రకటించింది. ఎలాగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకాక తప్పదని భావించిందా? లేక తెలంగాణ నుంచి ప్రతినిధులు హాజరుకాకున్నా సమావేశాలు షెడ్యుల్ ప్రకారం నిర్వహించడం పట్ల వ్యూహన్ని మార్చకుందా? అనేది అసక్తిగా మారింది.
నిజానికి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులన్ని వెళ్లడం తెలంగాణకు ఇబ్బందే. కానీ బహిరంగంగా మాత్రం ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు గెజిట్ అమలుకు సంబందించిన సమన్వయ సమావేశాల్లో తమ వాదనను ఎలా వినిపించాలో సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఅర్. ఓ వైపు సమన్వయ సమావేశాలకు హాజరవుతూ.. తమకున్న వ్యతిరేఖతను ఎలా తెలియజేస్తారు.. అసలు నదీ జలాల అంశంలో కేసీఅర్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారనేది ఇప్పుడు అసక్తిగా మారింది.
(రిపోర్టర్ రాకేష్, టీవీ9 తెలుగు)
Also read:
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..
Shocking News: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ప్రాణాలు కోల్పోయిన 30 మంది చిన్నారులు..
Supreme Court: మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు..