Hyderabad Tree City of The World: ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’.. దేశంలోనే ఏకైక నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు..!

తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆర్బర్ డే ఫౌండేష‌న్ అనే సంస్థ ప్రకటించిన 2021 ట్రీ సిటీగా హైద‌రాబాద్‌ను వరించింది.

Hyderabad Tree City of The World: ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’.. దేశంలోనే ఏకైక నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు..!
Hyderabad Tree City Of The World
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 31, 2021 | 6:48 AM

Hyderabad as Tree City of The World: తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆర్బర్ డే ఫౌండేష‌న్ అనే సంస్థ ప్రకటించిన 2021 ట్రీ సిటీగా హైద‌రాబాద్‌ను వరించింది. భారత దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ‘గ్రీన్‌ స్టేట్‌’గా, అలాగే దేశంలోనే ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’ నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. నార్వే అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మాజీ మంత్రి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్‌హెయిమ్‌ సోమవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా 2019 20 సంవత్సరంలో తెలంగాణలో 38 కోట్ల పైచిలుకు మొక్కలను నాటారని ఆయన తెలిపారు. కేవలం ఆరేళ్లలోనే రాష్ట్రంలో పచ్చదనం(గ్రీన్‌ కవర్‌) 4 శాతం పెరిగిందని చెప్పారు. భారత దేశం నుంచి హైదరాబాద్‌ మాత్రమే ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా గుర్తింపు పొందిందని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

ఎరిక్‌ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌.. తెలంగాణకు గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు తాము చేసిన ప్ర‌య‌త్నాల‌కు ఇది గుర్తింపు అని కెటిఆర్ అన్నారు. హ‌రిత‌హారంలో భాగంగా హైద‌రాబాద్‌లో 2020 ఏడాది వ‌ర‌కు 2.4 కోట్ల మొక్క‌లు నాటిన‌ట్లు ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది.

గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2021 గుర్తింపునకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపునిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు ప్రకటించాయి.

గతంలో కన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, అడవులను పెంచడం ద్వారా హైదరాబాద్ నగరం మరింత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షులు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు. 2021 మార్చి 1వ తేదిన గాని అంతకుముందేగాని హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించనున్నామని డాన్ లాంబే రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

Read Also… Tollywood: డ్రగ్స్‌ కొనేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు డబ్బు ఎలా చెల్లించారు? డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో విచారణ మళ్లీ మొదలు