AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Election Results: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘోర ఓటమికి కారణాలివేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..!

Huzurabad Election - Trs Defeat: సాధారణంగా బైపోల్‌లో అధికార పార్టీదే హవా ఉంటుందని తెలుసు. కానీ, హుజూరాబాద్‌లో మాత్రం అలా జరుగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ టఫ్‌ ఫైట్ ఇచ్చినప్పటికీ...

Huzurabad Election Results: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘోర ఓటమికి కారణాలివేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..!
Trs Vs Bjp
Shiva Prajapati
| Edited By: |

Updated on: Nov 03, 2021 | 12:08 PM

Share

Huzurabad Election – Trs Defeat: సాధారణంగా బైపోల్‌లో అధికార పార్టీదే హవా ఉంటుందని తెలుసు. కానీ, హుజూరాబాద్‌లో మాత్రం అలా జరుగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ టఫ్‌ ఫైట్ ఇచ్చినప్పటికీ విజయతీరాలకు మాత్రం చేరలేదు. 2018లో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారింలోకి వచ్చాక జరిగిన నాలుగో బైపోల్‌ ఇది. కానీ అవన్నీ ఒక ఎత్తు. ఒక్క హుజురాబాద్ మరో ఎత్తు. ఇక్కడి లెక్కలు వేరు. ఈక్వేషన్స్ వేరు. బైపోల్‌ వచ్చిన సందర్భం వేరు. అందుకే ఈ ఉపఎన్నికకు ఎక్కడా లేని ప్రత్యేకత సంతరించుకుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణలేంటి? హుజురాబాద్‌లో ఏం జరిగింది?.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న చెబుతున్న కీలక పాయింట్స్‌ ఏంటి? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

1. గెల్లు బలమైన అభ్యర్థి కాకపోవడం.. గెల్లు శ్రీనివాస్‌ బలమైన అభ్యర్థి కాకపోవడం టీఆర్ఎస్‌కు అతిపెద్ద మైనస్. ఏ రకంగా చూసినా ఆయన ఈటలకు సరితూగలేదు. హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించే వరకు గెల్లు ఎవరికీ తెలియదు. చివరికి సొంత గ్రామం హిమ్మత్‌నగర్‌లోనూ ఈటలపై ఆధిక్యం సాధించ లేకపోయారు గెల్లు. ఈటల అనుభవం ముందు తేలిపోయారు.

2. ఫలితమివ్వని దళితబంధు.. ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న దళితబంధు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఫైలెట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లోనే ఈ స్కీమ్‌ను ప్రారంభించింది ప్రభుత్వం. నియోజకవర్గంలోని శాలపల్లి కేంద్రంగా సీఎం కేసీఆర్ సభ కూడా పెట్టారు. ఇక్కడ 27 వేలకుపైగా దళితకుటుంబాలు ఉన్నప్పటికీ అవి ఓట్లుగా మారలేదు.

3. ఇతర కులాల్లో అసంతృప్తి.. దళితబంధు మంచి పథకమే. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే ఇతర కులాల్లో అసంతృప్తికి కారణమైంది. మాకూ అలాంటి పథకం కావాలంటూ చాలా కులాలు ఆందోళనకు దిగాయి. బీసీ ఓట్లు టీఆర్ఎస్‌కు పూర్తిస్థాయిలో పడకపోవడానికి దళితబంధు ఓ కారణం.

4. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. సహజంగానే ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంటుంది. హుజురాబాద్‌ బైపోల్‌లోనూ అది కనిపించింది. వ్యతిరేక ఓటంతా బీజేపీ వైపు మళ్లింది.

5. నిరుద్యోగుల్లో అసంతృప్తి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో కాస్త అసంతృప్తి ఉంది. నోటిఫికేషన్లు రావడం లేదంటూ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. అందుకే నిరుద్యోగులు, యూత్ ఓట్లు పడలేదన్న అంచనాలున్నాయి.

6.కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్‌ఫర్ కావడం.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి వేరు. బల్మూరి వెంకట్ పూర్తిగా తేలిపోవడం, కాంగ్రెస్‌ నేతలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. ఆ ఓటు బ్యాంక్‌ అంతా బీజేపీ వైపు మళ్లింది.

7. క్యాస్ట్ ఈక్వేషన్స్‌లో తేడా.. టీఆర్ఎస్ అంచనా వేసినంతగా క్యాస్ట్ ఈక్వేషన్స్ పనిచేయలేదు. ఈటలకు పోటీగా బీసీ క్యాండిడేట్‌నే బరిలోకి దింపినప్పటికీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. బీసీలతోపాటు రెడ్డిసామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైంది. దళితుల ఓట్లూ ఆశించిన స్థాయిలో పడలేదు.

8. ఈటలపై సానుభూతి.. ఈటలపై ఉన్న సానుభూతి కూడా టీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారింది. మరోసారి ఈటలకే ఛాన్స్ ఇద్దామన్న ఆలోచనతో కొన్ని ఓట్లు పడ్డాయి.

9. ద్వితీయ శ్రేణి నేతలు లేకపోవడం.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు ద్వితీయ శ్రేణి నేతలు పెద్దగా లేరు. గతంలో అన్నీ తానై వ్యవహరించేవారు ఈటల రాజేందర్. దీంతో హైకమాండ్‌ కూడా ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై పెద్దగా ఫోకస్ చేయలేదు.

(టీవీ9, న్యూస్ డెస్క్)

Also read:

Zodiac Signs: ఈ 3 రాశులవారికి అసూయ ఉండదు..! ఇతరుల విజయాన్ని ఆనందిస్తారు..

Indian Railway: ట్రైన్‌ డ్రైవర్‌ జీతం ఇంజనీర్‌ కంటే ఎక్కువ..! ఎందుకో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఎప్పుడైనా చూశారా ?.. ఎక్కడెక్కడున్నాయంటే..