Huzurabad Bypoll: రేపే హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్.. 22 రౌండ్లలో ఫలితం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
Huzurabad Bypoll Counting: తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30న ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికకు..

Huzurabad Bypoll Counting: తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30న ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికకు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఇక టీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా.. నేనా అన్నట్లు సాగింది ప్రచారం. ఇక ఎన్నడు లేనంతగా పోలింగ్ శాతం నమోదైంది.
ఈ ఉప ఎన్నికక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నవంబర్ 2న ఉదయం 8 గంటలకు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హల్స్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్క హాల్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు ఇచ్చే శిక్షణ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈవీఎంలను భద్రపర్చిన అధికారులు.. ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపరాఉ. పలు రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. జగిత్యాల వైపు నుంచి నగరానికి వచ్చే వాహనాలు రేకుర్తి, శాతవాహన వర్సిటీ, చింతకుంట, పద్మనగర్, గీతభవన్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలని సూచించారు. జగిత్యాల వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలని, అవసరమైతే ఇతర ప్రాంతాల్లో కూడా సందర్భాన్ని బట్టి ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: