Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cotton Prices: పత్తి రైతు పంట పండింది.. భారీగా పలుకుతోన్న ధర

రైతుల పంట పండుతోంది. కనీస మద్దతు ధర కంటే.. ఎక్కువ ధర పలుకుతుండడంతో అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసా మార్కెట్‌లో రికార్డు స్థాయిలో 8 వేల పలుకుతోంది.

Cotton Prices: పత్తి రైతు పంట పండింది.. భారీగా పలుకుతోన్న ధర
Cotton Price
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 01, 2021 | 7:53 AM

తెలంగాణలో తెల్లబంగారం అన్నదాతకు పంట పండిస్తోంది. ధర ఎక్కువగా పలుకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక.. ఆరుగాలం కష్టించినా కనీస మధ్దతు ధర రాక చేనుపైనే వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెట్టుబడి రాక, ధరలు లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. లక్షలు పెట్టుబడులు పెట్టి, లక్షలు పెట్టి భూమిని కౌలుకు తీసుకొని.. పత్తి సాగు చేస్తే చివరికి మిగిలేది మాత్రం సున్నానే అని మథన పడుతున్న తరుణంలో.. ప్రస్తుత సీజన్‌లో రైతులకు అందుతున్న ధర ఉత్సాహాన్ని ఇస్తోంది. నిర్మల్‌ భైంసా మార్కెట్‌లో పత్తి క్వింటాల్‌ 8వేలు పలుకులోంది. అటు వరంగల్‌ పత్తి మార్కెట్‌లో కూడా 8వేల 2వందల వరకు ధర పెట్టి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. బయటి దేశాల్లో పత్తికి డిమాండ్‌ పెరగడంతో.. ఇక్కడ వ్యాపారులు రైతుల నుంచి ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసుందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రభుత్వ మార్కెట్‌లో పత్తి కొనుగోలు ప్రారంభించకున్నా ప్రైవేటుగానే వ్యాపారులు పెద్ద ఎత్తున పత్తికి అధిక ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ముందుగానే తేరుకున్న వ్యాపారులు ముందుగా వచ్చే క్వాలిటీ పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనడం వల్ల వ్యాపారుల మధ్య ఉన్న పోటీతో పత్తి ధర అమాంతంగా పెరిగి పోతోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తున్న ఈ ధర ముందు ముందు ఉంటుందో ఉండదో మాత్రం తెలియదు. అయితే.. ప్రపంచ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ వల్ల ధరలు మరింత పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసం లేదంటున్నారు. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా ఈసారి పత్తి దిగుబడి అనుకున్నంత రాకపోవడంతో.. అధిక వర్షాలతో వేల ఎకరాల్లో పంట పాడవడం.. ఉన్న పంట కూడా నాణ్యతగా రాకపోవడం వల్ల కూడా ధరలు స్థిరంగా ఉండొచ్చు. మరో వైపు దళారులు రైతులను మార్కెట్‌లో ముంచేస్తూనే ఉన్నారు. తేమ శాతం పేరుతో తక్కువ ధర పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాపారులు చేస్తున్న మాయాజాలంతో రైతులు చితికి పోతున్నారు. ఈ మోసంపై మార్కెటింగ్‌ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే స్పందించి రైతులకు సాయం చేయాల్సిన అవసరం ఉంది.

Also Read: చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు.. సెంచరీ దాటిన బీరకాయ, చిక్కుడు, పచ్చి మిర్చి

పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్.. రివర్స్ పంచ్ వేసిన అంబటి..