AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Election Result 2023: ఈటెల చేజారిన హుజురాబాద్

Huzurabad Assembly Election Result 2023 Live Counting Updates: ఈ సారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగారు పాడి కౌశిక్ రెడ్డి. బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసిన  ఈటల రాజేందర్ మరోసారి ఎన్నికల్లో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి వడితల ప్రణవ్ పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి చాలా ఎమోషనల్‌గా ఓటర్లను ఓట్లు అడిగారు. కౌశిక్ మంత్రం వర్కువుట్ అయ్యింది.

Huzurabad Election Result 2023:  ఈటెల చేజారిన హుజురాబాద్
Huzurabad
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2023 | 7:07 PM

Share

ఈ సారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి హుజురాబాద్ (Huzurabad Assembly Election) అభ్యర్థిగా బరిలోకి దిగారు పాడి కౌశిక్ రెడ్డి. బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసిన  ఈటల రాజేందర్ మరోసారి ఎన్నికల్లో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి వడితల ప్రణవ్ పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి చాలా ఎమోషనల్‌గా ఓటర్లను ఓట్లు అడిగారు. ఆ మంత్రం వర్కువుట్ అయ్యింది. ఆయన  16873 ఓట్లతో గెలుపొందారు. కౌశిక్‌కు 80333 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి ఈటలకు 63460 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్‌కు 53164 ఓట్లు పడ్డాయి.

ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ అగ్ర నేతగా ఉండేవారు ఈటెల రాజేందర్‌. కానీ ఊహించని రీతిలో.. 2021లో సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. భూ కబ్జా కేసుల విచారణ కూడా ఎదుర్కొన్నారు ఈటల. దీంతో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిపోయారు. అ తర్వాత జరిగిన హుజురాబాద్ బై ఎలక్షన్‌లో23,855 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు ఈటెల. సానుభూతి, స్థానికత, ప్రభుత్వ వ్యతిరేకత ఈటలకు ప్లస్ అయ్యాయి. ఈటెలకు 107022 ఓట్లు రాగా..  BRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 83,167 ఓట్లు పడ్డాయి. కాగా కాంగ్రెస్‌ అభ్యర్థికి నర్సింగరావుకు 3,014 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు.  ఈటెల BJPలోకి వెళ్లడం అంతకుముందు అక్కడ ఆ పార్టీకి అసలు బలం లేదు. అక్కడ ఆయన సొంత ఇమేజ్‌తో బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. ఈటెల హుజూరాబాద్‌లో ఐదుసార్లు, అంతకుముందు కమలాపూర్‌లో రెండుసార్లు గెలిచారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

2018లో అప్పటి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసిన ఈటెల రాజేందర్‌కు 104840 రాగా, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్‌ రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్