హైకోర్టులో BRS కు ఎదురుదెబ్బ.. జిల్లా BRS కార్యాలయాన్ని కూల్చి చేయాలంటూ ఆదేశం..!

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నల్లగొండలోని గులాబీ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య కార్యాలయ వివాదం మరింత ముదిరి పాకానపడింది.

హైకోర్టులో BRS కు ఎదురుదెబ్బ.. జిల్లా BRS కార్యాలయాన్ని కూల్చి చేయాలంటూ ఆదేశం..!
High Court On Brs Building
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Sep 18, 2024 | 8:17 PM

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నల్లగొండలోని గులాబీ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య కార్యాలయ వివాదం మరింత ముదిరి పాకానపడింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ పట్టణంలో పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించాలంటూ స్థానిక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పలుసార్లు అధికారులకు విజ్ఞప్తులు, వినతి పత్రాలు ఇచ్చారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ ఆఫీస్ కోసం హైదరాబాద్ రోడ్డులో ఉన్న రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఆగ్రోస్) కు చెందిన ఎకరం స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎకరానికి మొత్తం నాలుగు లక్షల 84 వేల రూపాయలను బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ చెల్లించింది. దీంతో ఆ స్థలాన్ని ప్రభుత్వం బీఆర్ఎస్ నల్లగొండ బీఆర్ఎస్ కు అలాట్ చేసింది.

ప్రభుత్వం అలాట్ స్థలంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించింది. పార్టీ అధికారంలో ఉందన్న భావనతో స్థానిక నేతలు పార్టీ భవన నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు మునిసిపాలిటీ నుంచి తీసుకోకుండానే నిర్మించారు. ఇలా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఇప్పుడు వివాదం చెలరేగుతుంది. నల్లగొండ పట్టణం నడిబొడ్డున.. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మించారని ఆగష్టు నెలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో.. పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చేయాలని.. మున్సిపల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.

ఈ నేపథ్యంలో నల్లగొండ మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. దీనిపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు.. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలంటే మున్సిపల్ అధికారులను ఆదేశించింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది.

నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం విషయంలో హైకోర్టు ఆదేశాలతో ఒకసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. అయితే బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో మరో బెంచిని ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..