Telangana Weather : రాగల 3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Telangana Weather Report: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. నిన్న ఏర్పడిన

Telangana Weather : రాగల 3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు..  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Weather Report
Follow us
uppula Raju

|

Updated on: Sep 25, 2021 | 3:42 PM

Telangana Weather Report: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. నిన్న ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. 27న ఈశాన్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు తెలంగాణ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. మత్స్యకారులు ఈ రెండు రోజులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

Guntur: అకస్మాత్తుగా రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి.. కానీ అంతలోనే ఊహించని విషాదం

టాలీవుడ్‌లో కొత్త అందాలు.. క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మలు..

IPL 2021, DC vs RR: రికార్డులకు ఒక అడుగు దూరంలో అశ్విన్, శాంసన్.. అవేంటంటే?