Jupally Krishna Rao: పెద్దకొత్తపల్లిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు..!
Jupally Krishna Rao: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..
Jupally Krishna Rao: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై ఆయన కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొల్లాపూర్ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, పైరవికారులను, దోపిడీ చేసేవాళ్లను గౌరవిస్తున్నారని ఆరోపించారు. అమానుషంగా, అవమానకరంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, నాగర్ కర్నూలు ఎస్పీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయం జరుగుతున్నా.. నిమ్మకునీరెత్తినట్లు ఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంట్లో నుండి బయటకు రారని, వందశాతం ప్రజాస్వామ్య పద్దతులలో నిలదీస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటూ జూపల్లి చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పరిపాల అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ జిల్లాలు చేశారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం సౌకర్యాలు కల్పించారని అన్నారు.