Heavy rain: తెలంగాణకు అతి భారీ వర్షసూచన.. ఆ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
Orange Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇవాళ 11 జిల్లాలకు, రేపు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రాలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. తెలంగాణలో ఇవాళ ఏఏ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఉందో, ఏ ప్రాంతాలకు గ్రీన్ అలర్ట్ ఉందో ఓసారి చూద్దాం.
హైదరాబాద్, సెప్టెంబర్ 04: తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఇప్పటికే ఆరంజ్ అలెర్ట్ కొనసాగుతుంది. రానున్న 48 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తన ఈరోజు సముద్రం మట్ట 5.8 కి.మీ ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దాని ప్రభావం వల్ల పశ్చిమ బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడ ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి.
అయితే పది జిల్లాలో ఆరంజ్ అలెర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉష్ణోగ్రతల్లో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గత రెండు రోజుల క్రితం 32°C నుండి 36°C నమోదైన ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి 28°C కు చేరుకుంది. వర్షాలు పడటం వల్లే వాతావరణానికి కాస్త చల్లబడింది అని వెల్లడించింది వాతావరణ శాఖ. మొత్తానికి సెప్టెంబర్ 7 వరకు రాష్ట్రంలో వర్షాలు కొన్ని సాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో కూడా భారీ వర్షపాతమే నమోదైంది. ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురిసిందో ఇప్పుడు చూద్దాం.
- పెద్దాలింగాపురం (సిరిసిల్ల) – 12 సెం.మీ.
- ఆసిఫ్‌నగర్ (కరీంనగర్) – 12 సెం.మీ.
- సుల్తానాబాద్ (పెద్దపల్లి) – 12 సెం.మీ.
- ఇల్లంతకుంట (సిరిసిల్ల) – 10 సెం.మీ.
- శ్రీరామ్‌పూర్ (పెద్దపల్లి) – 10 సెం.మీ.
ఏపీలోనూ దంచి కొడుతున్న వర్షాలు..
గత 24గంటల్లో ఏపీ అంతటా వర్షాలు దంచికొట్టాయి. రాష్ట్రంలో నమోదైన వర్షపాతాలే దీనికి రుజువు. నంద్యాల, ప్రకాశం, కడప, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. అసలు ఎక్కడెంత వర్షపాతం నమోదు అయ్యిందో ఫాస్ట్‌గా ఒకసారి చూద్దాం.
- కోయిలకుంట్ల (నంద్యాల) – 18 సెం.మీ.
- గిద్దలూరు (ప్రకాశం) – 18 సెం.మీ.
- పెద్దముడియం (కడప) – 17 సెం.మీ.
- లింగందిన్నె (నంద్యాల) – 16 సెం.మీ.
- మైలవరం (కడప) – 14 సెం.మీ.
ఐఎండీ ట్వీట్ చూడండి..
Daily Weather Briefing (English) 03-09-2023#imd #weatherupdate #india #odisharain #Chhattisgarh #rain #rainfall #heavyrain #heavyrainfall #monsoon #weatherupdate
YouTube : https://t.co/woizXrOtNS Facebook: https://t.co/4rfXmVObpD@moesgoi @DDNewslive @ndmaindia@airnewsalerts pic.twitter.com/VgcjbhyiWQ
— India Meteorological Department (@Indiametdept) September 3, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి