Heart Attack: ఒక వ్యక్తికి ఎన్నిసార్లు గుండెపోటు వస్తుంది? ఆ సమస్యను ఎలా నివారించాలి..
ప్రస్తుత బిజీ కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తింటూ.. రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు..

ప్రస్తుత బిజీ కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తింటూ.. రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో.. గుండెపోటు వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. చెప్పాలంటే.. గుండె మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. జీవితం ఎక్కువ కాలం ఉండాలంటే.. గుండె పనితీరు కూడా సరిగా ఉండాలి. సాధారణంగా ఒక వ్యక్తి అనారోగ్యకరమైన ఆహారం, క్రమ రహితమైన జీవనశైలి, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుకు గురవుతారు. దీని వల్ల వారి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్నిసార్లు గుండెపోటుకు గురవుతారనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం..
గుండెపోటు ఎందుకు వస్తుంది?
శరీరంలో ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు.. అది ఫలకల మాదిరిగా పేరుకుపోతుంది. ఇది రక్త నాళాలలో రక్త సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తుంది. అదికాస్తా గుండెకు రక్తం సరఫరాను అడ్డుకుంటుంది. దీని కారణంగా రక్తం గుండెకు చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండెపోటుకు దారి తీస్తుంది.
గుండెపోటు లక్షణాలు..
గుండెపోటు సమస్య ఉంటే.. ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస ఆడకపోవడం, అధిక చెమట, ఛాతీ నొప్పి, తలతిరగడం, అలసట, దవడ లేదా పంటి నొప్పి, వికారం, వాంతులు, గ్యాస్ వంటి లక్షణాలు ఉంటాయి.




గుండెపోటు ఎన్నిసార్లు వస్తుంది?
ఒక వ్యక్తి జీవితకాలంలో సాధారణంగా 3సార్లు గుండెపోటు వస్తుంది. చాలా మంది కార్డియాలజిస్టులు దీనిని విశ్వసిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో అనేకసార్లు వచ్చే అవకాశం ఉంది. మరికొన్నిసార్లు తక్కువగా రావొచ్చు. సాధారణంగా 40 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ గుండెపోటు భారిన పడే ప్రమాదం ఉంది. ఇది ఏ క్షణంలోనైనా రావొచ్చు.
గుండెపోటును నివవారించే మార్గం..
గుండెపోటు సమస్య రాకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, నూనెతో కూడిన ఆహారాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజువారీ శారీరక శ్రమ అవసరం. అవకాశం దొరికినప్పుడల్లా వ్యాయామం చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
