Minister Harish Rao: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల బ్రాండ్ మరింత పెంచాలి..పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి…
Minister Harish Rao: ఉస్మానియా(Osmania), గాంధీ ఆసుపత్రుల(Gandhi Hospital) సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిఎంఇ రమేష్ రెడ్డి,.
Minister Harish Rao: ఉస్మానియా(Osmania), గాంధీ ఆసుపత్రుల(Gandhi Hospital) సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిఎంఇ రమేష్ రెడ్డి, Tsmsidc ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విభాగాల వారీగా పనితీరు గురించి మంత్రి సమీక్షించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నారన్నారు. విలువైన వైద్య పరికరాలు సమకూర్చుకోవడం, ఔషధాల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు..అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై నమ్మకం మరింత పెరిగేలా సేవలందించాలని సూచించారు. చికిత్స విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నామని, పేషెంట్లతో ఆప్యాయంగా ఉంటూ వైద్య సేవలు అందిస్తే మరింత మంచి పేరు వస్తుందన్నారు.
ఆస్పత్రి సిబ్బంది కూడా రోగులు, అటెండర్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేషంట్లను హెచ్ వోడీలు పలకరిస్తూ… ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయి అని తెలుసుకోవాలన్నారు. రోగులకు అన్ని వేళల్లో అత్యవసర వైద్య సేవలు అందాలని, ఆరోగ్య శ్రీ -ఆయుష్మాన్ భారత్ కేసులు మరింత పెరగాలన్నారు. ఇతర రాష్ట్రాల వారికి సైతం ఈ పథకంలో భాగంగా చిక్సితలు అందేలా చూడాలన్నారు. కిడ్నీ, మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరగాలన్నారు. కరోనా బాధిత గర్భిణీలకు వైద్య సేవలు అందించిన గాంధీ గైనిక్ డిపార్ట్మెంట్ ను మంత్రి అభినందించారు. సీ సెక్షన్ డెలివరీలు తగ్గించి, నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే రీతిలో మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలన్నారు. డెలివరీ జరిగిన వెంటనే కేసీఆర్ కిట్స్ అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు, సాధారణ మరణాలు, సి సెక్షన్లపై ఆడిటింగ్ రిపోర్ట్ సిద్దం చేయాలన్నారు. సివిల్ వర్క్స్ పనులను రెండు ఆసుపత్రుల్లో వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉస్మానియాలో కొత్త మార్చురీ 9 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెలవారీ సమీక్ష ఉంటుందని, విభాగాల వారీగా రిపోర్టులతో సిద్దంగా ఉండాలన్నారు. పని చేసేవారికి తప్పక ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.
Also Read: పర్యాటక స్వర్గధామం హిమాచల్ ప్రదేశ్