Hyderabad: పండుగవేళ తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడ్డ పాతబస్తీ.. అసలు ఏం జరిగిదంటే..?
హైదరాబాద్‌లో శనివారం(మార్చి 29) ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. గుడి మల్కాపూర్ పరిధిలోని కింగ్స్ ప్యాలెస్‌లోని ఆనం మీర్జా ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో వివిధ రకాల వ్యాపారులు భారీగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇద్దరు దుకాణాదారుల మధ్య చిన్నపాటి గొడవ కాల్పుల దాకా వెళ్లింది

హైదరాబాద్‌లో శనివారం(మార్చి 29) ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. గుడి మల్కాపూర్ పరిధిలోని కింగ్స్ ప్యాలెస్‌లోని ఆనం మీర్జా ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో వివిధ రకాల వ్యాపారులు భారీగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇద్దరు దుకాణాదారుల మధ్య చిన్నపాటి గొడవ కాల్పుల దాకా వెళ్లింది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో ఒక షాప్ కీపర్ గాలిలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరగడంతో ఎక్స్‌పో చూడటానికి వచ్చిన సందర్శకులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం(మార్చి 29) ఉదయం 8 గంటల ప్రాంతంలో కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో రంజాన్ సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం టాయ్స్ స్టాల్ ఫారుక్ అహ్మద్ అతని సోదరుడు సయ్యద్ హారున్ బొమ్మల షాపు నిర్వహిస్తున్నారు. వీరి పక్కనే దుబాయ్‌కు చెందిన తౌఫిక్ పెర్ఫ్యూమ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే ఒక పెర్ఫ్యూమ్ ఉచితంగా ఇవ్వాలని ఫరూక్ అహ్మద్ అడిగాడు. ఆందుకు తౌఫిక్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్యలో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.
పెర్ఫ్యూమ్ అమ్మే వ్యక్తి టాపిక్ ఆర్గనైజర్ అయిన మీర్ హసీబుద్దీన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో బొమ్మల షాపు నిర్వహకులను పిలిచి హసీబుద్దీన్ మందలించేందుకు ప్రయత్నించాడు. దీంతో మరోసారి వీరి మధ్య గొడవ జరగగా, ఇంతలో ఆర్గనైజర్ హసబుద్దీన్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసుకుని గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాల్పులు జరిపిన వ్యక్తి హసీముద్దీన్ పరిగి మాజీ సర్పంచ్‌గా గుర్తించినట్లు ఏసీపీ మునావర్ తెలిపారు. ఈ గొడవతో సంబంధం లేకున్నా అదేపనిగా హసిముద్దీన్ కాల్పులు జరిపినట్లు తెలిపారు. హసీముద్దీన్‌కు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ లైసెన్స్ ఉందని అన్నారు. అయితే రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. హసీముద్దీన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మునావర్ వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..