AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నడిరోడ్డుపై ఎయిర్ రైఫిల్‌తో ఓవరాక్షన్.. తిక్క కుదిర్చిన పోలీసులు!

ఇప్పుడు యువత రీల్స్ వెర్రి ఏ స్థా్యికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఎన్నో పిచ్చి వేషాలు వేస్తున్నారు. లేనిపోని ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో కూడా న్యూసెన్స్‌ చేస్తున్నారు. ఈ మధ్య మెట్రో రైళ్లలో కూడా పలువురు రీల్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.

Hyderabad: నడిరోడ్డుపై ఎయిర్ రైఫిల్‌తో ఓవరాక్షన్.. తిక్క కుదిర్చిన పోలీసులు!
Reels With Gun
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 29, 2025 | 4:58 PM

Share

ఇప్పుడు యువత రీల్స్ వెర్రి ఏ స్థా్యికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఎన్నో పిచ్చి వేషాలు వేస్తున్నారు. లేనిపోని ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో కూడా న్యూసెన్స్‌ చేస్తున్నారు. ఈ మధ్య మెట్రో రైళ్లలో కూడా పలువురు రీల్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే హైదరాబాద్‌లో ఓ యువకుడు ఎయిర్ గన్‌తో రీల్స్ చేయడం చర్చనీయాంశమైంది. రోడ్లపై వెళ్లేవారిని భయబ్రాంతులకు గురిచేస్తూ.. అతను రోడ్డుపై ఎయిర్ గన్‌లో రీల్స్ చేశాడు. తమ దృష్టికి రావడంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మొహద్ అఫీజుద్దీన్ వీడియో గ్రాఫర్‌. అతను ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఎయిర్ రైఫిల్‌తో హల్ చల్ చేశాడు. ఓపెన్ టాప్ జీపులో ఫోజు కొడుతూ.. డాష్‌బోర్డుపై ఎయిర్ రైఫిల్‌ను పెట్టి ఫోజు కొట్టాడు. అంతేకాదు తన వ్యవహారాన్ని వీడియోలు తీసి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో.. బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి అతన్ని వెతికి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ రైఫిల్‌తో పాటు జీపును సీజ్ చేశారు. నిందితుడు చేసిన పని నేరమని పోలీసులు తెలిపారు. యువత ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రీల్స్ మోజులో పడి యువత బంగారం లాంటి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?