AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యారే… లిఫ్ట్ అడిగి 10 కిలోమీటర్లు కార్‌లో ట్రావెల్ చేసిన కొండముచ్చు..

ఆ కొండముచ్చు జాలీ రైడ్ వెళ్లాలనుకుంది. దీంతో ఓ కారు ఎక్కి కూర్చుంది. ఎంత గద్దించినా పోలేదు. బిస్కెట్స్ ఇచ్చినా నాకు ఏం వద్దు అన్నట్లు మారాం చేసింది. దీంతో ఎంతకీ కారు దిగకపోవడంతో.. అలానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు ఆ వ్యక్తి.. కొంతదూరం వెళ్లాక...

Telangana: అయ్యారే... లిఫ్ట్ అడిగి 10 కిలోమీటర్లు కార్‌లో ట్రావెల్ చేసిన కొండముచ్చు..
Baboon On Car
Ram Naramaneni
|

Updated on: Mar 29, 2025 | 4:13 PM

Share

జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఓ కొండ ముచ్చు హల్చల్ చేసింది తొర్రూరు గ్రామానికి చెందిన నూకల నవీన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రామవరం మీదుగా హైద్రాబాద్ వెళ్తున్నాడు. దారిలో రామవరం గ్రామంలోని ఓ కిరణం షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కొని కారు దగ్గరకి వచ్చేసరికి కారుపై ఓ కొండముచ్చు కూర్చుని కనిపించింది. కారు సైడ్‌ మిర్రర్‌పైన కూర్చుని ఉన్న కొండముచ్చును చూసి ఒకింత భయపడ్డాడు ఎక్కడ తనపై దాడిచేస్తుందోనని. కారులో ఇంకా స్నేహితులు కూర్చుని ఉన్నారు. కారు స్టార్టింగ్‌లోనే ఉంది. అయినా కొండముచ్చు భయపడలేదు. మిర్రర్‌పైన కూర్చుని కదల్లేదు. మిత్రులంతా కలిసి దానిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా .. నేను మీతో వస్తాను అన్నట్టుగా మిర్రర్‌పైనే కూర్చుని ఉంది. బిస్కెట్స్‌, చిప్స్‌, వాటర్‌ ఇచ్చినా అవేమీ నాకొద్దు మీతో పాటు నేనూ రైడ్‌కి వస్తాను అన్నట్టుగా మొండికేసి కూర్చుంది.

చేసేది లేక ఫ్రెండ్స్‌ అంతా కారు స్టార్ట్‌ చేసి బయలుదేరారు. అలా కారు మిర్రర్‌పై కూర్చుని 10 కిలోమీటర్లు ప్రయాణించిన కొండముచ్చు రైడ్‌ని బాగా ఎంజాయ్‌ చేసింది. కారుపై జాలీగా ట్రావెల్ చేస్తూ స్థానికులను ఆకట్టుకుంది కొండముచ్చు. అలా కారుపై ప్రయాణిస్తూ మొండ్రాయి గ్రామ సమీపంలోని ఓ చెట్టుకింద కారు ఆపాడు నవీన్‌. దీంతో కాసేపటికి ఆ కొండముచ్చు థాంక్స్‌.. ఇక మీరు వెళ్లండి.. మా ఊరు వచ్చేసింది.. బై.. అన్నట్టుగా కారు దిగి వెళ్లిపోయింది కొండముచ్చు. ఇదంతా వీడియో తీసి నవీన్‌ ఫ్రెండ్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో దూకుడు
ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో దూకుడు
వందల కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చిరు పొంగల్ హిట్స్
వందల కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చిరు పొంగల్ హిట్స్
విదేశాల్లోనూ జగన్నాథుడి వైభవం.. ఆక్స్‌ఫర్డ్ మ్యూజియంలో విగ్రహాలు.
విదేశాల్లోనూ జగన్నాథుడి వైభవం.. ఆక్స్‌ఫర్డ్ మ్యూజియంలో విగ్రహాలు.
ముసుగులు ధరించి మైదానంలోకి.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షాకింగ్ సీన్
ముసుగులు ధరించి మైదానంలోకి.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షాకింగ్ సీన్
‘మన శంకరవరప్రసాద్’ హిట్ తర్వాత అక్కకు అరుదైన కానుక ఇచ్చిన చరణ్!
‘మన శంకరవరప్రసాద్’ హిట్ తర్వాత అక్కకు అరుదైన కానుక ఇచ్చిన చరణ్!
అక్రమంగా నిల్వ చేస్తే అంతే.. వారికి హైడ్రా సీరియస్ వార్నింగ్
అక్రమంగా నిల్వ చేస్తే అంతే.. వారికి హైడ్రా సీరియస్ వార్నింగ్
యాపిల్ తినే ముందు ఈ ఒక్క పని చేయండి.. లేదంటే డాక్టర్ దగ్గరికి..
యాపిల్ తినే ముందు ఈ ఒక్క పని చేయండి.. లేదంటే డాక్టర్ దగ్గరికి..
రైతులకు ఏపీ ప్రభుత్వం అలర్ట్..
రైతులకు ఏపీ ప్రభుత్వం అలర్ట్..
అదిరిపోయే ఫీచర్లలో రాబోతున్న నథింగ్‌ ఫోన్‌ 4ఏ ప్రో..?
అదిరిపోయే ఫీచర్లలో రాబోతున్న నథింగ్‌ ఫోన్‌ 4ఏ ప్రో..?
మోదీ మార్క్ ఏఐ వ్యూహం.. టెక్ దిగ్గజాలతో ప్రధాని భేటీ..
మోదీ మార్క్ ఏఐ వ్యూహం.. టెక్ దిగ్గజాలతో ప్రధాని భేటీ..