Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?

Telangana: ఖమ్మం జిల్లా పినపాకలో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ రేగా కాంతారావు మధ్య అంతర్గత పాలిటిక్స్ నడుస్తున్నాయి.

Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?
Trs
Follow us

|

Updated on: Feb 27, 2022 | 8:59 PM

Telangana: ఖమ్మం జిల్లా పినపాకలో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ రేగా కాంతారావు మధ్య అంతర్గత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా అని రేగా అంటే.. అంతలేదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాదు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రెండు వర్గాల నేతలు దాడులకు దిగారు. తలలు పగిలి.. రక్తాలు కారాయి. ఈ వివాదం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇంతకీ వారి మధ్య వివాదం ఎందుకు? ఇప్పు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు కొంత ప్రత్యేకమనే చెప్పాలి. అక్కడ పార్టీలో విభేదాలు, వర్గపోరు కామన్‌. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేగాకాంతారావు ఇష్యూతో ఆ రచ్చ మరోసారి రోడ్డెక్కింది. రెండు వర్గాల మధ్య ఓరేంజ్‌ డైలాగ్‌ వార్‌నడుస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం తాజా వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. అయితే ఈ గ్రూపుల మధ్య తగాదా ఇప్పటిదికాదు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్యపోరు ఇప్పుడు మళ్లీ ఒకసారి అలా బయటకు వచ్చింది.

పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం మల్లెల మడుగులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి వచ్చారు. ఈ ప్రోగ్రాంపై లోకల్‌ ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావుకు ఎలాంటి సమాచారం లేదు. దాంతో మా అడ్డాలో మీ పెత్తనం ఏంటని పొంగులేటి అండ్‌ టీమ్‌ను నిలదీశారు రేగా వర్గీయులు. అంతే రెండు వర్గాలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. పరస్పరం దాడులు, లాఠీఛార్జ్‌ వరకూ వెళ్లింది. పిడమర్తి ఆవిష్కరించిన విగ్రహానికి పాలాభిషేకం చేశారు రేగా వర్గీయులు.

ఇదిలాఉంటే.. రేగా తీరుపై ఫైర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రేగా ఊరుకుంటేనా.. తనపై విమర్శలు చేసిన ఈ ఇద్దరు నేతలకు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. పినపాకపై యుద్ధానికి వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు గాజులు వేసుకొని లేరంటూ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేశారు. నా అడ్డాలో నీ పెత్తనమేంటని సూటిగా నిలదీశారు. ఈ వివాదం చివరకు పార్టి అధిష్టానం వద్దకు చేరుకుంది. మరి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది.

ఇదిలాఉంటే మల్లెమడుగులో జరిగిన ఘటనలో మొత్తం 17 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్ళురి బ్రహ్మయ్య, సహా వారి అనుచరులపై కేసులు పెట్టారు పోలీసులు. అంతేకాదు.. మల్లెల మడుగులో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు 144 సెక్షన్ కూడా విధించారు.

Also read:

Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..

Russia – Ukraine Crisis: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ బ్యూటీ.. గన్ను చేతపట్టి నేను సైతం అంటూ కదనరంగంలోకి..

Rahul Gandhi – Gujarat: గుజరాత్‌లో సొంత పార్టీ నేతలకే ఝలక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఇంతకీ ఆయన చేశారంటే..!

Latest Articles
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..