AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుంపుగా కోతులు వచ్చి మీదడిపోతే ఎట్టుంటుందో తెల్సా.. వీడియో చూస్తే మతిపోతుంది

వేలాది కోతులు ఒకేచోట చేరి ఘర్షణ పడితే ఇలా ఉంటుంది..! అసలే కోతులు అవి కీచులాడుకుంటే అక్కడ మనుషులు నిలబడగలరా..! ఆ దృశ్యం చూసే వారికి వెన్నులో ఎలా వణుకు పుడుతుంది..! ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Telangana: గుంపుగా కోతులు వచ్చి మీదడిపోతే ఎట్టుంటుందో తెల్సా.. వీడియో చూస్తే మతిపోతుంది
Telugu News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 07, 2025 | 1:59 PM

Share

వేలాది కోతులు ఒకేచోట చేరి ఘర్షణ పడితే ఇలా ఉంటుంది..! అసలే కోతులు అవి కీచులాడుకుంటే అక్కడ మనుషులు నిలబడగలరా..! ఆ దృశ్యం చూసే వారికి వెన్నులో ఎలా వణుకు పుడుతుంది..! హనుమకొండ జిల్లాలో అదే జరిగింది. ఓ ఊరిని రణరంగంగా మార్చేసిన వానరసేనలు అక్కడ భీకర కీచులాటతో బీభత్సం సృష్టించాయి..వేలాది కోతుల వార్ తో గ్రామస్తులు కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ విచిత్ర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామంలో జరిగింది.. రెండు కోతుల గ్రూపుల మధ్య భీకర వార్ జరిగింది.. ఓ ఇంటి పైకి చేరిన రెండు వర్గాలు కీచులాటలతో రక్కుకొని గాయపరచుకున్నాయి.

వేలాది కోతులు ఒకే చోటకు చేరి ఘర్షణ పడడంతో అక్కడ యుద్ధ వాతావరణం అలముకుంది. ఎక్కడినుండి వచ్చాయో తెలియదు .ఒకేసారి వేల సంఖ్యలో వానర సేనలు ఊరిపై మోహరించాయి.. ఈ క్రమంలో రెండు మంకీస్ గ్రూప్ ల మధ్య చిన్నపాటి యుద్ధాన్ని తలపించేలా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.. ఓ ఇంటిపైకి వేల సంఖ్యలో చేరుకున్న కోతులు ఘర్షణ పడ్డాయి. వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన కోతుల మధ్య ఘర్షణ వాతావరణం చూసి ఊరంతా ఉలిక్కి పడ్డారు.. ఓ కాలనీలో ప్రజలు కొంత సేపు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే సాహసం చేయలేదు..వేలాది కోతులను చూసి తీవ్ర భయాందోళన చెందిన గ్రామస్తులు కోతుల బెడద నుండి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us