చీమలకు ఎవరు భయపడతారు? ఏ విటమిన్ లోపం వల్ల ఇది జరుగుతుంది?
చాలా మందికి చాలా విషయాలంటే భయం. ఉదాహరణకు, కొందరు బల్లులకు, మరికొందరు పాములకు, మరికొన్ని విషయాలంటే భయం. కానీ కొంతమందికి చీమలంటే కూడా భయం అని మీకు తెలుసా? ఇది కొంచెం వింతగా, సినిమా కథలాగా అనిపించవచ్చు. కానీ కొంతమందికి చీమలంటే భయం అనేది నిజం. తాజాగా చీమల ఫోబియాతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దిగ్భ్రాంతికరమైన సంఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.

చాలా మందికి చాలా విషయాలంటే భయం. ఉదాహరణకు, కొందరు బల్లులకు, మరికొందరు పాములకు, మరికొన్ని విషయాలంటే భయం. కానీ కొంతమందికి చీమలంటే కూడా భయం అని మీకు తెలుసా? ఇది కొంచెం వింతగా, సినిమా కథలాగా అనిపించవచ్చు. కానీ కొంతమందికి చీమలంటే భయం అనేది నిజం. తాజాగా చీమల ఫోబియాతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో మంగళవారం (నవంబర్ 4) సాయంత్రం చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లాకు చెందిన చిందం శ్రీకాంత్, ద్యావనపల్లి మనీషా (25) దంపతులు. వీరికి మూడేండ్ల కూతురు. ఉద్యోగరీత్యా అమీన్‌పూర్ పరిధిలోని నవ్య హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలంటే భయం. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చీమలకు భయపడి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు చీమలే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసుకుంది. ‘శ్రీ.. ఐయామ్ సారీ, ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు. కూతురు అన్వి జాగ్రత్త..! అని లేఖలో పేర్కొంది. అయితే కొందరు కొన్నికీటకాలను చూసి భయపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వారి శరీరంలో కొన్ని విటమిన్ల లోపం. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. చీమలతో జీవించలేను. మీ కూతురిని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి” అని లేఖ రాసింది.
చీమలకు ఎందుకు భయపడుతున్నారు?
ఈ రకమైన భయాన్ని మైర్మెకోఫోబియా అంటారు. ఇది ఒక నిర్దిష్ట భయం. ఇందులో ఒక వ్యక్తి చీమల పట్ల తీవ్ర భయం లేదా ఆందోళనను అనుభవిస్తాడు. ఈ భయం చాలా తీవ్రంగా ఉంటుంది. చీమల గురించి ఆలోచించడం కూడా ఆ వ్యక్తిని అసౌకర్యానికి గురి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చీమల చుట్టూ ఉండకుండా చూసుకుంటారు. బయట తినడానికి లేదా తోటపని చేయడానికి భయపడతారు. చీమలంటే భయపడే వ్యక్తుల హృదయ స్పందన వేగవంతంగా ఉంటుంది. చెమటలు పట్టడం లేదా వణుకు, చీమలతో సంబంధం ఉన్న ప్రదేశాలు లేదా వస్తువులను నివారించడం వంటి అనేక శారీరక, మానసిక లక్షణాలను అనుభవించవచ్చు.
ఏ విటమిన్ లోపం వల్ల ఇది సంభవిస్తుంది?
ఈ పరిస్థితికి ఏ విటమిన్ కారణమవుతుందనే దానిపై ఇంకా ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ అనేక వనరులలో ఇది విటమిన్ బి12 లోపం వల్ల కావచ్చు అని కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ బి12 బలమైన నాడీ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. బి12 లోపం అలసట, బలహీనత, మతిమరుపు, భయం వంటి మానసిక సమస్యలను కలిగిస్తుంది. నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు, చిన్న విషయాలు కూడా భయాన్ని రేకెత్తిస్తాయంటున్నారు నిపుణులు.
