Telangana: తెల్లారితే కొడుకు పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు తండ్రి..
తెలంగాణలో వరుస హార్ట్ ఎటాక్ ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. రీసెంట్ గా భద్రాద్రి కొత్తగూడెం,కామారెడ్డి జిల్లాలో మరో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో వరుస హార్ట్ ఎటాక్ ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. రీసెంట్ గా భద్రాద్రి కొత్తగూడెం,కామారెడ్డి జిల్లాలో మరో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. మంగళ తోరణాలు, బంధువుల సందడితో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట చావు డప్పులు మోగాయి. చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ మూర్తి సెడన్ గా గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో పెట్టింట విషాదఛాయలు అలముకున్నాయి. మూర్తి ఒక్కగానొక్క కుమారుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. దీంతో మూర్తి కుమారుడు శ్రీకర్ పెళ్లి ఈనెల 9వ తారీఖున అంగరంగ వైభవంగా జరిపించేంకు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలోనే మూర్తి గుండెపోటుతో చనిపోవడంతో కన్నీరుమున్నీగా విలపించారు కుటుంబ సభ్యులు, బంధువులు. సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇంట నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
కామారెడ్డి జిల్లాలోను సేమ్ సీన్ రిపీటైంది. ఆటోలో డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఆటో నడుపుతుండగా సెడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆటోలో నుంచి జారీ కిందపడిపోయాడు. అదే మార్గంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు గమనించి హార్ట్ బీట్ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ.. కొద్దిసేటికే అతడు హార్ట్ స్ట్రోక్ తో ప్రాణాలు విడిచాడు. మృతుడు బీబీపేట మండల కేంద్రానికి చెందిన 34 ఏళ్ల మదార్ గా గుర్తించారు. కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..