Paddy Procurement: వరి కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం.. యాసంగిలో వరి వేయిద్దంటూ స్పష్టీకరణ.. టీఆర్ఎస్ నేతల అసహనం..

Paddy Procurement: తెలంగాణలో వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. యాసంగి, రబీలో వరి వేయవద్దంటూ స్పష్టం చేసింది.

Paddy Procurement: వరి కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం.. యాసంగిలో వరి వేయిద్దంటూ స్పష్టీకరణ.. టీఆర్ఎస్ నేతల అసహనం..
Niranjan Reddy
Follow us

|

Updated on: Nov 26, 2021 | 10:43 PM

Paddy Procurement: తెలంగాణలో వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. యాసంగి, రబీలో వరి వేయవద్దంటూ స్పష్టం చేసింది. అంతేకాదు.. కోటా పెంపు, ఖరీఫ్ – రబీ కలిపి మొత్తం ఎంత ధాన్యం సేకరిస్తారో కూడా చెప్పలేదు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌పై స‌మావేశంలో చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఖ‌రీఫ్‌, ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. యాసంగిలో వరి వేయొద్దని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కోటా పెంపుపైనా స్పష్టత ఇవ్వలేదు. రబీలోనూ వరి సాగు చేయవద్దని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

కాగా, ఈ నెల 23న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు. కేంద్రం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా యాసంగిలో అనుసరించాల్సిన విధానంపై రైతులకు మార్గ నిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు