AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangareddy: గేదెలు మేపుతున్న మహిళను సమీపించిన దుండగుడు.. సెకన్ల వ్యవధిలో

విలాసవంతమైన జీవితం కోసం చైన్ స్నాచింగ్ బాట పట్టిన ఓ యువకుడు చివరకు జైలు పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి శివారులో మహిళపై దాడి చేసి తాళిబొట్టు లాక్కెళ్లిన ఘటనలో నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. .. ..

Sangareddy: గేదెలు మేపుతున్న మహిళను సమీపించిన దుండగుడు.. సెకన్ల వ్యవధిలో
Buffalo (Representative Image)
P Shivteja
| Edited By: |

Updated on: Dec 25, 2025 | 11:18 AM

Share

జల్సాగా బతకాలి అన్న కోరికతో ఓ యువకుడు కటకటల పాలయ్యాడు. చేస్తున్న పనిలో వస్తున్న నగదు తక్కువ రావడంతో దొంగతనాలు చేసైనా సరే విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకున్నాడు.  పాడు ఆలోచన ఎవర్నైనా ఊరికే వదలుతుందా చెప్పండి.. చివరకు అతన్ని జైలు పాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామ శివారులో గత సోమవారం రోజు సుజాత అనే మహిళ గేదలు మేపుతున్నారు. ఆ సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తి ఆమె మేడలో నుంచి గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించగా.. మహిళ ప్రతిఘటించడంతో.. కత్తితో మెడపై, కడుపులో దాడి చేసి తాళిబొట్టుతో పరాయ్యాడు. వెంటనే అలర్టైన సంగారెడ్డి రూరల్ పోలీసులు… 24 గంటలు గడవకముందే అదుపులోకి తీసుకున్నారు. మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జగన్ అనే వ్యక్తి ఆ ఏరియాలో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  వస్తున్న నగదు సరిపోకపోవడంతో.. చైైన్ స్నాచింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు.  ఇలా మహిళ మెడ నుంచి గొలుసును దొంగలించి.. కటకటాల పాలయ్యాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..  

Follow Us