Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మల్టీ నేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా 2,000 మందికి..

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
Job Seekers
Follow us
Prabhakar M

| Edited By: Ravi Kiran

Updated on: Mar 19, 2025 | 6:36 PM

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మల్టీ నేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. బుధవారం ఉదయం అసెంబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ తదితర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదిరింది.

ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. మెక్ డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా ఉన్నారు.

తెలంగాణ పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానం – మెక్ డొనాల్డ్స్

హైదరాబాద్‌ను గ్లోబల్ ఇండియా ఆఫీస్ కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ, మెక్ డొనాల్డ్స్ తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రభుత్వం ఉత్తమ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మెక్ డొనాల్డ్స్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ మాట్లాడుతూ, హైదరాబాద్ బెంగళూరుతో పోలిస్తే మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన నిపుణులు, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయనే కారణంగా తమ గ్లోబల్ ఆఫీస్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఉద్యోగ అవకాశాలు & నైపుణ్య అభివృద్ధి

గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. యువతకు అవసరమైన శిక్షణ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మెక్ డొనాల్డ్స్ తమ గ్లోబల్ ఆఫీస్‌తో పాటు దేశ, విదేశాల్లోని తమ అవుట్‌లెట్లలోనూ ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సీఎం సూచించారు.

రైతులకు ప్రయోజనం

మెక్ డొనాల్డ్స్ అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను తెలంగాణ రైతుల నుంచే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్ డొనాల్డ్స్ అవుట్‌లెట్లు ఉన్నాయి. సంస్థ ప్రతీ ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.