కొన్ని విషయాలు వింటున్నా చూసినా ఇదేమిట్రా బాబు అని కళ్ళు తిరిగిపోతాయి సామాన్య జనాలకు. అసలు ఇలాంటివి జరగటం సాధ్యమేనా అనిపిస్తాయి. కానీ అలాంటి అద్భుతాలు జరగడమే జీవితంలో అసలైన విజయం. ఇప్పుడు చూడబోతున్న ఈ విశేషం సరిగ్గా అలాంటిదే. ఇది ఈ దేశంలోని అపురూప సంఘటన. ఎవరు ఎప్పుడో ఎక్కడ చూడని విశేషం. అసలు ఆ టీలో ఏముందో ఏమిటో భార్య ఎత్తున ఒకటికి రెండు టీలు తాగుతారు. పైగా ఎక్కడినుంచో వచ్చి మరి ఇక్కడ టీ రుచి చూసి ఆనందిస్తారు. హైదరాబాద్ చరిత్రలోని ఎన్నో కథలు, కార్యక్రమాలు, జ్ఞాపకాలు. నీలోఫర్ కాఫీ అనేది అమ్మలాంటి ఆనవాళ్ళు. అంతర అతీలోను నిలబడి మరి టీ తాగేస్తారు ఇక్కడి జనాలు. అందులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది.
చాలా మంది ఒకసారి ఇంట్లో టీ తాగినా సరదాగా బయట కూడా నచ్చిన చోట టీ తాగుతూ ఉంటారు. అయితే ఎక్కడైనా బయట టీ తాగాలంటే కొన్ని ప్రత్యేకమైన చోట్లు ఉంటాయి. అలాంటిదే భాగ్యనగర్‌లో నీలోఫర్ కాఫీ. అంత గొప్ప ఈ నీలోఫర్ కాఫీ ఓనర్ బాబూరావు. ఆయన సామాన్యుడు కాదు. అలాంటి మనిషి ఎక్కడా ఉండరు. హైదరాబాద్‌లో చాలా కాలం నుండి నీలోఫర్ చాయ్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎప్పుడూ కూడా ఆ చాయ్ దుకాణంలో జనం ఎక్కువగానే ఉంటారు. బాబూరావు తాను నెలకు కట్టే జీఎస్టీ 25 లక్షల వరకు ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పైగా ఆ చాయ్ దుకాణంలో 690 మంది పనిచేస్తున్నారు. వాళ్లకు రోజు భోజనానికి 3 లక్షలు అవుతుంది. అయితే నిజానికి బాబూరావు ఈ టీ దుకాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా టీ ఉంటే బాగుంటుంది అనేది బాగా ఆలోచించి ఆ విధంగా తయారుచేశారు. టీకు ఒక ఫార్ములా కనిపెట్టారు. ఒక సైంటిస్ట్ ఒక వినూత్న టీ కోసం పరిశ్రమించారు.
హైదరాబాద్ లో ఫేమస్ అయిన నిలోఫర్ కేఫ్ కు సంబంధించి 4 బ్రాంచులు ఉండగా.. కొత్తగా రాయదుర్గం ప్రాంతంలో కేఫ్ ఏర్పాటుకు ఓ భవనాన్ని అద్దెకి తీసుకుంది. అయితే బిల్డింగ్ రెంట్ ప్రతి నెలా రూ.40 లక్షల రూపాయలని సమాచారం.. దీనికి 10 సంవత్సరాలకు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది.. దీనికి సంబంధించి నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రస్తుతం సింగిల్ టీ రూ. 50, ఫుల్ టీ రూ.70 లు ఉండగా.. అక్కడ ఇంకెంత ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈరోజు నీలోఫర్‌ను ఒక భారీ పరిశ్రమగా మార్చారు ఆయన. నినిజానికి ఈయన కట్టే జీఎస్టీ నెలకు 25 లక్షల రూపాయలు ఉంటే టర్నోవర్ ఎంత ఉంటుందో చూసుకోండి. పైగా బాబూరావు మనసు ఎంతో విశాలమైనది. పేదవాళ్లకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. టీ షాప్ లో మిగిలిన బ్రెడ్, బిస్కెట్లను పేదవాళ్లకు పంచుతూ ఉంటారు. ప్రస్తుతం రోజుకు 500 మందికి టిఫిన్స్, 300 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. పేదవాళ్లు అడగగానే కాదనకుండా సహాయం అందిస్తారు. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బాబూరావు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. నష్టాలలో ఉన్న నీలోఫర్ కాఫీని ఆయన కాంట్రాక్టుగా తీసుకొని మంచిగా లాభాలను సంపాదించడం మొదలుపెట్టారు. చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డ బాబూరావు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మెచ్చుకోవాల్సిందే.