Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! పీఆర్సీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం..?
Telangana Employees : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించబోతుంది.
Telangana Employees : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించబోతుంది. ఎన్నో రోజులుగా వారు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రక్రియపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మంగళవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా లాక్‌డౌన్ కొనసాగింపు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ముఖ్యమైన అంశం వేతన సవరింపు సంఘం (పీఆర్సీ) కూడా అజెండాలో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని గుర్తించి కేబినెట్ ముందు పెట్టి, ఆమోదం తెలిపి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దాని తర్వాత కూడా జీవోలు ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. మార్చి నుంచి కొనసాగుతున్న పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే పెండింగ్లోనే ఉంది. దీనిపై ఉద్యోగులు కూడా ఆశలు వదిలేసుకున్నట్టే మాట్లాడుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో పీఆర్సీ ఫైలును ప్రభుత్వానికి ఇవ్వగా మార్చిలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలోప్రకటన చేసిన విషయం తెలిసిందే. 30 శాతం ఫిట్మెంట్ ఇస్తామని ప్రకటించారు. ఏప్రిల్ నుంచే అమల్లోకి వస్తుందన్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి మార్గదర్శకాలన్నీ రెడీ అయి సీఎం ఆమోదం కోసం పంపించారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్ పడింది.