AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ మొబైల్ నుంచే ఇన్‏కమ్ టాక్స్ ఫైలింగ్.. అందుబాటులోకి కొత్త పోర్టల్ తీసుకువచ్చిన కేంద్రం..

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీ మొబైల్ నుంచే ఇన్‏కమ్ టాక్స్ ఫైలింగ్.. అందుబాటులోకి కొత్త పోర్టల్ తీసుకువచ్చిన కేంద్రం..
Efiling Portal
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2021 | 3:14 PM

Share

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి మరింత సులభంగా ఉండేందుకు సరికొత్త ఈ- ఫైలింగ్ పోర్టల్ ని ప్రారంభించింది. ఈ పోర్టల్ ఈరోజు నుంచి (జూన్ 7) అందుబాటులో ఉంచింది. దీంతో పన్ను చెల్లింపుదారులు మొబైల్ ద్వారా కూడా లాగిన్ అయ్యి ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. పన్ను చెల్లించేవారు మునుపటి ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ధాఖలు చేయాల్సి ఉంటుంది. ఇంకా దాఖలు చేయనివారు 2021 జూలై 31 వరకు ఆర్థిక సంవత్సరానికి (2020-21) రిటర్న్ దాఖలు చేయవచ్చు.

ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పూర్తి వివరాలను తెలియజేసింది. ఆదాయ పన్ను కట్టేవాళ్ళకి మరింత పారదర్శకత, త్వరితగతిన సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ- ఫైలింగ్ పోర్టల్ లో ఆదాయ పన్ను ఫైలింగ్ త్వరగా పూర్తవడంతో పాటు రిఫండ్స్ కూడా త్వరగా రానున్నాయి. ఈ పోర్టల్ 2.0లో కొత్తగా మొబైల్ యాప్ లో డిజైన్ చేసింది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫారం ముందే నింపిన ఆదాయపు పన్ను వివరాలు, సాధారణ ఆదాయ పన్ను సౌకర్యం వంటి సమాచారాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. ఆదాయపు పన్ను శాఖ తన మొబైల్ యాప్‌లో పోర్టల్ యొక్క అన్ని ముఖ్యమైన లక్షణాలను కూడా అందుబాటులోకి తెస్తుంది.

ఆదాయపు పన్ను శాఖ కూడా వర్తింపు చెక్ యుటిలిటీపై పనిచేస్తోంది. పన్ను చెల్లింపుదారుడి ప్రశ్నకు సమాధానంగా, ఆదాయపు పన్ను విభాగం, “సెక్షన్ 206AB / 206CCA కింద పన్ను చెల్లింపుదారులు / కలెక్టర్ల కోసం అభివృద్ధి చేస్తున్న అనువర్తనం ప్రస్తుతం అభివృద్ధి చేస్తుండగా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. పన్ను చెల్లింపుదారులు మొబైల్ యాప్ ద్వారా జీతం, ఆస్తి, వ్యాపారం లేదా వృత్తితో సహా వారి ఆదాయ వివరాలను అందించడానికి వారి ప్రొఫైల్‌ను అప్ డేట్ చేయవచ్చు. టిడిఎస్, ఎస్‌ఎఫ్‌టి వివరాలు అప్‌లోడ్ చేసిన తర్వాత జీతం ఆదాయం, వడ్డీ, డివిడెండ్, క్యాపిటల్ లాభాలతో పాటు ముందే నింపిన ఫారమ్ యొక్క వివరణాత్మక సమాచారం లభిస్తుందని సిబిడిటి తెలిపింది.

Also Read: లోన్ తీసుకున్న వ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోతే ఆ డబ్బును వారసులు కట్టాల్సిందేనా ? నియమాలు ఏంటంటే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి