Crypto frauds: క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారా..! అయితే ఈ సైబర్ టిప్స్ మీ కోసమే…
క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నారా..? ఇలాంటి తెలుసుకున్న తర్వాతే మీరు డిజిటల్ కరెన్సీలోకి అడుగు పెట్టండి.. లేకుంటే మీ కోసం సైబర్ నేరగాళ్లు నెట్టింట్లో రెడీగా ఉన్నారని సైబర్ దోస్త్ హెచ్చరిస్తోంది...
బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడిదారుల ఆసక్తి నిరంతరం పెరుగుతోంది. చాలా క్రిప్టోకరెన్సీలు వారంలో మొదటి రోజు గ్రీన్ జోన్‌లో వర్తకం చేస్తున్నారు. పెట్టుబడిదారులకు బిట్‌కాయిన్, డాగ్‌కోయిన్‌తో సహా ఏదైనా క్రిప్టోకరెన్సీల గురించి సాంకేతిక అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ.. ఆకర్షణీయమైన రాబడి కారణంగా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని కొందరు సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చకుంటున్నారు.
రోజు రోజుకు డిజిటల్, ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. సైబర్ నేరాలకు అడ్డకట్ట వేయడంతోపాటు ఇలాంటి నేరాలపై అప్రమత్తం చేయడానికి కేంద్ర హోం శాఖ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జూన్ 4 న ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా సైబర్ దోస్ట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో క్రిప్టో పెట్టుబడిదారులకు వివిధ రకాల మోసాలపై అవగాహన కల్పించడంతోపాటు.. కొన్ని రకాల చిట్కాలను కూడా చెప్పారు. ఈ చిట్కాలను అనుసరించి సైబర్ నేరగాళ్ల నుంచి మనని మనం రక్షించుకోవచ్చు.
Beware with #Cryptofrauds pic.twitter.com/JDnu84W4B7
— Cyber Dost (@Cyberdost) June 4, 2021
నాలుగు టిప్స్..
- వెబ్‌సైట్లు మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడిదారులను స్కామర్లు ఆకర్షిస్తుంటారు.
- ఆకర్షణీయమైన ఆఫర్‌లు మరియు నకిలీ అగ్రిమెట్లు కల్పిస్తుంటారు.. ఇలాంటివాటిలో పడకండి.
- పెట్టుబడి కోసం ఆన్‌లైన్ బదిలీ లేదా గిఫ్ట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయడానికి పెట్టుబడిదారులను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటారు మోసగాళ్ళు.
- పెట్టుబడి పెట్టేముందు ఆన్‌లైన్ క్రిప్టో సమీక్షలను చదవండి.. అప్రమత్తంగా ఉండండి.., వివరణాత్మక పరిశోధనలు చేయండి.
సైబర్ క్రైమ్ అంటే..
సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్ ఆధారితంగా జరిగే నేరం. కంప్యూటర్, కంప్యూటర్ నెట్‌వర్క్, నెట్‌వర్క్ డివైజ్‌లే లక్ష్యంగా చేసే దాడి సైబర్ క్రైమ్ అంటారు. ఈజీ మనీ కోసం సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు.. ఇలాంటి నేరాలకు పాల్పడతారు.
సైబర్ క్రైమ్ ఎలా చేస్తారు..
కంప్యూటర్ సిస్టమ్స్ లేదా నెట్‌వర్క్‌లను అక్రమంగా, అనధికారంగా యాక్సెస్ చేయడం లేదా హ్యాకింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం, ఈ మెయిల్ బాంబింగ్, సలామి ఎటాక్, సర్వీస్ ఎటాక్‌ను అడ్డుకోవడం, వైరస్ లేదా వార్మ్ దాడులు, లాజిక్ బాంబ్స్, ఇంటర్నెట్ టైమ్ థెఫ్ట్స్… వంటివన్నీ వివిధ రూపాల్లో ఉండే సైబర్ నేరాలు.
బిట్‌కాయిన్ ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కరెన్సీ
ఇక క్రిప్టోకరెన్సీ విషయానికి వస్తే.. బిట్‌కాయిన్ అత్యంత ప్రాచుర్యం పొందింది. అదే సమయంలో ఇది ప్రపంచంలోనే మొదటి డిజిటల్ కరెన్సీ. క్రిప్టోకరెన్సీల వ్యామోహం గత కొన్నేళ్లుగా చాలా పెరిగింది. ప్రస్తుతం 1500 వర్చువల్ కరెన్సీలు చెలామణిలో ఉన్నాయి. ఇందులో Ethereum, Ripple, Dogecoin వంటి డిజిటల్ కరెన్సీలు ఉన్నాయి.
రోజుకు 50 లక్షల మంది పెట్టబడి..
ఎకనామిక్ పత్రికలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం… రోజుకు దేశంలో 50 లక్షల మంది వ్యాపారులు 24 ఎక్స్ఛేంజీల సహాయంతో రోజుకు 1500 బిట్ కాయిన్లపై వ్యాపారం చేస్తున్నారు. ఈ విలువ సుమారు రూ .100 కోట్లు ఉంటుందని అంచనా. అయితే కరోనా లాక్‌డౌన్‌లో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ 400 శాతం పెరిగిందని మనీ కంట్రోల్ నివేదిక తెలిపింది.
క్రిప్టోకరెన్సీల్లో 15 వేల కోట్ల పెట్టుబడి
క్రిప్టో ఎక్స్ఛేంజీల అంచనా ప్రకారం.. భారతదేశంలో సుమారు 15 మిలియన్ల మంది క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం భారతీయ ప్రజల వద్ద సుమారు రూ .15 వేల కోట్లు ఉన్నాయి.