Banking Fines: బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
భారతదేశంలో ఇటీవల కాలంలో పెరిగిన బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఏటీఎం ద్వారా సొమ్ము విత్ డ్రా చేసుకోవడం సర్వసాధారణం అయ్యింది. అయితే ఒక్కోసారి మన ఖాతా నుంచి బ్యాలెన్స్ కట్ అయినా ఏటీఎం నుంచి సొమ్ము రాదు. ఇలాంటి సమయంలో నిర్ణీత వ్యవధిలోపు బ్యాంకులు మన ఖాతాలో రీఫండ్ చేయాలి. అలా చేయకపోతే ఖాతాదారుడికే బ్యాంకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఏటీఎంకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తే మీ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే లావాదేవీ విఫలమవుతుంది. అయితే మీ ఖాతాలో సొమ్ము ఉండి కూడా మీ ఖాతా నుంచి డిడక్ట్ అయిన నగదు ఏటీఎం నుంచి రాదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. నిర్ణీత సమయంలో మనకు సొమ్ము ఆ బ్యాంకు ఇవ్వకపోతే రోజుకు రూ.100 ఖాతాదారుడికి చెల్లించాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. విఫలమైన లావాదేవీపై ఖాతా నుంచి డిడక్ట్ చేసిన డబ్బును బ్యాంక్ వాపసు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు అలా చేయకుంటే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కఠినమైన నియమం గురించి తెలుస్తుంది.
ఆర్‌బీఐ 20 సెప్టెంబరు 2019న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిలో టీఏటీను సమం చేయాలని అంటే కస్టమర్‌లకు సకాలంలో రీఫండ్ పరిహారం చెల్లించాలని పలు సూచనలు చేశారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం లావాదేవీ విఫలమైతే, డెబిట్ చేసిన డబ్బును గడువులోపు బ్యాంకు రివర్స్ చేయకపోతే, దానిపై బ్యాంకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే పెనాల్టీ రోజువారీగా పెరుగుతుంది. లావాదేవీ స్వభావాన్ని బట్టి అంటే విఫలమైన లావాదేవీ రకాన్ని బట్టి బ్యాంక్ పెనాల్టీని చెల్లిస్తుంది. మీ లావాదేవీకు సంబంధించి వైఫల్యం వెనుక ఏదైనా కారణం ఉంటే మాత్రమే బ్యాంక్ పెనాల్టీని చెల్లిస్తుంది. మీ లావాదేవీ రివర్సల్ సమయం మీకు తెలిస్తే మీరు బ్యాంక్‌ని సంప్రదించి జరిమానా చెల్లించాలని
ఖతాదారుడు ఏటీఎం నుంచి లావాదేవీ జరిపితే ఖాతా నుంచి డబ్బు డిడక్ట్ చేసినా నగదు విత్‌డ్రా కాకపోతే లావాదేవీ జరిగిన రోజు నుండి 5 రోజులలోపు బ్యాంకు దానిని రివర్స్ చేయాలి. లేని పక్షంలో మీకు రూ.100 చొప్పున బ్యాంకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కార్డ్-టు-కార్డ్ బదిలీ చేసి మీ ఖాతా నుంచి డబ్బు డిడక్ట్ చేసి లబ్ధిదారుడి ఖాతాకు చేరకపోతే, బ్యాంకు రెండు రోజులలోపు డెబిట్‌ను రివర్స్ చేయాలి. లేకపోతే ఎన్ని రోజులు పడితే అన్ని రోజులకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పీఓఎస్ కార్డ్ ట్రాన్సాక్షన్, ఐఎంపీఎస్, యూపీఐ మీ ఖాతా నుంచి డబ్బు తీసేసినా మరొక ఖాతాకు జమ చేయకపోతే ఆర్‌బీఐ దీని కోసం బ్యాంకుకు టీ+1 రోజు సమయాన్ని ఇచ్చింది. ఈ వ్యవధిలో నగదు బదిలీ చేయకుంటే మరుసటి రోజు నుంచి బ్యాంకుకు రూ.100 జరిమానా విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి