Actor Charith: యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
తెలుగుతో పాటు పలు కన్నడ సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయిన నటుడు చరిత్ బాలప్ప అరెస్ట్ అయ్యారు. లైంగిక వేధింపుల కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చరిత్ బాలప్ప. తనను లైంగికంగా వేధించారని, చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.
ప్రముఖ బుల్లితెర నటుడు చరిత్ బాలప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 270 అతడిని అరెస్ట్ చేశారు. తెలుగు బుల్లితెరతో పాటు పలు కన్నడ సీరియల్స్‌లో చరిత్ నటించారు. అయితే తన ప్రియురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈ నటుడిపై ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. చరిత్ తనను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. చరిత్ తన సహచరులతో కలిసి యువతి ఉంటున్న ఇంట్లోకి చొరబడి వేధించినట్లు సమాచారం. అంతే కాకుండా యువతి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. చరిత్‌పై లైంగిక వేధింపులు, దాడి, హత్య బెదిరింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చరిత్ కు ఇప్పపటికే పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత కూడా అతను తన మాజీ భార్యతో గొడవ పడ్డాడు. ఔ
చరిత్ బాలప్ప 2017లో నటి మంజుని వివాహం చేసుకున్నారు. 2022 తర్వాత వీరి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. తర్వాత కోర్టులో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు డైవర్స్ పరిహారం కోసం నోటీసు పంపినందుకు తన మాజీ భార్యను బెదిరించినట్లు చరిత్ బాలప్పపై సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌లో గత జూన్‌లో కేసు నమోదైంది.
గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చరిత్ బాలప్ప..
View this post on Instagram
దర్యాప్తు కొనసాగుతున్నందున, చరిత్ బాలప్ప ప్రస్తుతం పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ కేసు కన్నడ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.
చరిత్ బాలప్ప లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
రిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.