జువెలరీ షోరూమ్ లో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయం.. పోలీసుల ఎంట్రీతో..!

ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ వ్యక్తి నగల దుకాణంలో చోరీకి ఫ్లాన్ చేశాడు. ప్రముఖ జువెలరీ షోరూమ్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. రోజు రోజు కొంచెంగా బంగారు నగలను మాయం చేశాడు. ఇలా రెండు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను మాయం చేశాడు. రికార్డుల్లో తేడాలు కనిపించడంతో సీసీ కెమెరాను తనిఖీ చేయడంతో అసలు భాగోతం బయటపడింది.

జువెలరీ షోరూమ్ లో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయం.. పోలీసుల ఎంట్రీతో..!
Gold Fraud
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 27, 2024 | 11:49 AM

సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు అభరణాలలను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రముఖ నగల దుకాణానికి చెందిన 37 ఏళ్ల అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు భానుదాస్ నగర్ నివాసి సందీప్ కుల్తేగా గుర్తించారు. ఈజీ మనీకి అలవాటు పడి పని చేసే చోటనే చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఔరంగాబాద్ జిల్లా భానుదాస్ నగర్ నివాసి సందీప్ కుల్తే నష్టాలను పూడ్చుకునేందుకు షేర్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కుల్తే పదేపదే దొంగతనాలకు పాల్పడినట్లు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ షిల్వంత్ నాందేడ్కర్ తెలిపారు. రెండు నెలల వ్యవధిలో నగలను దోచుకున్నట్లు తెలిపారు. షేర్ మార్కెట్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి, కొంత కాలం పాటు జరిగిన నష్టాలను పూడ్చేందుకు తాను బంగారాన్ని స్వాహా చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు ఆకాశవాణి చౌక్‌లోని ఆర్‌సి బఫ్నా జ్యువెలర్స్‌లో గత 18 నెలలుగా అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాల స్టాక్‌ను నిర్వహించడం, అమ్మకాల రికార్డులను నిర్వహించడం, రోజువారీ జాబితాను సరిదిద్దడం వంటి పనులను నిర్వహిస్తున్నాడు. అయితే రొటీన్ స్టాక్ వెరిఫికేషన్‌లో డిసెంబర్ 24 సాయంత్రం అనుమానాలు తలెత్తాయి. బంగారు గాజులు, గొలుసులు, కంకణాలు వంటి తప్పిపోయిన వస్తువులతో సహా జాబితాలో వ్యత్యాసాలను ఒక ఉద్యోగి గమనించాడు.

తదుపరి తనిఖీల్లో మొత్తం 264 గ్రాముల 24 క్యారెట్ల బంగారు గాజులు, 470 గ్రాముల 24 క్యారెట్ల బంగారు గొలుసులు, 1,287 గ్రాముల 22 కంకణాలు కనిపించకుండాపోయాయి. దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీల ద్వారా చోరీ జరిగనట్లు నిర్ధారించారు. దీంతో బ్రాంచ్ మేనేజర్ వినోద్‌కుమార్ దిలీప్‌సింగ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంస్థ ఉద్యోగి సందీప్ కుల్తేను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..