Chemical Factory Fire : పూణేలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. 5గురి ఆచూకీ లభించడం లేదు..
Chemical Factory Fire : పూణేలోని ఓ రసాయన కర్మాగారంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 12
Chemical Factory Fire : పూణేలోని ఓ రసాయన కర్మాగారంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 12 మంది మరణించారు. అదే సమయంలో 5 మందికి పైగా ఆచూకీ లభించడం లేదు. ఈ కేసు పూణే నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముష్లి తాలూకాలోని పిరంగట్ ఎంఐసిడి ఉరావాడే ప్రాంతానికి సంబంధించినది. మంటలు చెలరేగిన కర్మాగారం ఆక్వా టెక్నాలజీస్ కెమికల్ ఫ్యాక్టరీ. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఫైర్ బ్రిగేడ్, పూణే రూరల్ పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం ప్రకారం 12 మంది మృతదేహాలను కనుగొన్నట్లు అగ్నిమాపక దళం ఉద్యోగులు తెలిపారు. కాగా 5 మంది జాడ ఇంకా కనిపించలేదు. 37 మంది ఉద్యోగుల్లో 20 మందిని సురక్షితంగా కాపాడారు.
ఈ సంస్థలో శానిటైజర్ తయారీ పనులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం వచ్చిన తరువాత ఎనిమిది ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. పిఎంఆర్‌డిఎ చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర పోట్‌ఫోడ్, పాడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ ధుమాల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ” పూణేలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించిన వార్త చాలా బాధాకరమైనది ” అని ట్వీట్ చేశారు . ఈ సంఘటనలో క్షతగాత్రులందరికీ, వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను గాయపడినవారిని త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.