Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
తెలంగాణలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా1,32,996 నమూనాలను పరీక్షించగా 24 గంటల వ్యవధిలో 1,933 కరోనా పాజిటివ్ కేసులు...
తెలంగాణలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా1,32,996 నమూనాలను పరీక్షించగా 24 గంటల వ్యవధిలో 1,933 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. వైరస్ కారణంగా మరో 16 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 3,527 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,406 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,93,103కు చేరింది.ఇవాళ్టి వరకు కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,394కి పెరిగింది.
సిద్దిపేటలో బ్లాక్ ఫంగస్ శస్త్ర చికిత్స విజయవంతం
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ సర్జరీని డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన మోహినోద్దిన్(75) కోవిడ్ చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్‌కు బారినపడ్డాడు. దీంతో సిద్దిపేట మెడికల్ కళాశాల ఈఎన్‌టీ ప్రొఫెసర్ నాగరాజు, ఈఎన్‌టీ వైద్యులు అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ తమిళ అరస్, సూపరింటెండెంట్ జయశ్రీ, అనస్థీషియా డాక్టర్ చందర్ ఆధ్వర్యంలో సోమవారం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి బ్లాక్ ఫంగస్‌ను తొలగించారు. సిద్దిపేట ఆస్పత్రిలో నాలుగు కేసులుండగా, మొదటి ఆపరేషన్‌ను నిర్వహించారు. ప్రస్తుతానికి రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మైక్రో డిబ్రాయిడరీ ఎండోస్కోపి సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Also Read: పెళ్లి పందిట్లో ప్రియుడు.. పీటలపై నుంచి అతడితో వధువు ఛాటింగ్.. కట్ చేస్తే..