Telangana: పెళ్లి పందిట్లో ప్రియుడు.. పీట‌ల‌పై నుంచి అత‌డితో వ‌ధువు ఛాటింగ్.. క‌ట్ చేస్తే..

ఆ యువ‌తి 3 ఏళ్ల‌గా ఒక యువ‌కుడితో ప్రేమ‌లో ఉంది. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఇంట్లో పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పింది. అయితే ఉద‌యం పెళ్లి చేసుకుని..

Telangana:  పెళ్లి పందిట్లో ప్రియుడు.. పీట‌ల‌పై నుంచి అత‌డితో వ‌ధువు ఛాటింగ్.. క‌ట్ చేస్తే..
Marriage
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2021 | 4:04 PM

ఆ యువ‌తి 3 ఏళ్ల‌గా ఒక యువ‌కుడితో ప్రేమ‌లో ఉంది. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఇంట్లో పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పింది. అయితే ఉద‌యం పెళ్లి చేసుకుని.. రాత్రికి ప్రియుడితో జంప్ అవ్వాల‌ని స్కెచ్ వేసింది. పెళ్లిపీట‌ల‌పై కూర్చుని ప్రియుడితో ఛాటింగ్ చేసింది. దీంతో అనుమానం వ‌చ్చి ఆరా తీయ‌గా అసలు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చదువుతున్న యువతికి మహబుబ్‌నగర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు పెద్ద‌లు. ఆదివారం తలంబ్రాలు ఉండటంతో వధువు, ఆమె తరఫు బంధువులు శనివారమే వరుడి గ్రామానికి వచ్చారు. ఆదివారం ఉదయం పెళ్లి పీటలపై ఉన్న వధువు ప‌దే, ప‌దే సెల్‌ఫోన్‌లో ఛాటింగ్‌ చేస్తుండటం, ఎవరితోనో కంగారుగా మాట్లాడటం స‌న్నిహితులు కొందరు గుర్తించారు. తలంబ్రాలు అనంతరం పెళ్లి పందిరిలోనే అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పక్కకు తీసుకెళ్లి నిలదీశారు. అయినా అత‌డు నోరువిప్ప‌లేదు. దీంతో దేహశుద్ధి చేయడంతో అసలు విషయం చెప్పాడు.

తాను, ఆమె మూడేళ్లుగా ప్రేమించుకొంటున్నామని వెల్ల‌డించాడు. వారిద్దరు కలిసి ఫోన్‌లో దిగిన ఫొటోలు చూసి బంధువులు షాకయ్యారు. దీంతో వధువును, యువకుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వధువు తన స్వగ్రామానికే చెందిన యువకుడిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పింది. పెళ్లి తరవాత రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకొన్నట్లు అంగీక‌రించింది. ఆ యువకుడు కూడా శనివారమే పెళ్లి కూతురి వాహనం వెనుక బైక్‌పై వెంబడిస్తూ వచ్చినట్లు చెప్పాడు. రాత్రి వరకు పోలీస్ స్టేష‌న్‌లో ఇరు వర్గాలతో పోలీసులు విచారణ చేశారు. అయితే ఎవరూ కంప్లైంట్ చేసుకోకపోవడంతో కేసు నమోదు చేయలేదేదని ఎస్‌ఐ  తెలిపారు. ఇరువర్గాల అంగీకారం మేరకు వధూవరులను ఎవరి ఇంటికి వారిని పంపిస్తున్నామని, యువకుడిని కూడా వదిలేస్తున్నామని తెలిపారు.

Also Read: సీఎం కేసీఆర్ స్పెష‌ల్ ఆర్డ‌ర్స్.. న‌కిలీ విత్త‌నాలు అమ్మే కేటుగాళ్ల తాట తీస్తున్న పోలీసులు

బంతి ముఖానికి తగిలి గాయపడిన ఆస్ట్రేలియా క్రికెటర్.. పెదవులపై ఏడు కుట్లు, శస్త్ర చికిత్స

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!