TV9 CAMPAIGN VACCINATE ALL: వ్యాక్సినేషన్ ప్రోత్సాహానికి మీ ఐడియా అదిరింది గురూ..ఇలా అయితే అందరికీ వ్యాక్సిన్ సాధ్యమే బ్రదరూ!
TV9 CAMPAIGN VACCINATE ALL: ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడులో ఎన్నో ఉచిత పథకాలు ప్రకటిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అయితే, అదేవిధమైన కొత్త ఉచితాలను మళ్ళీ ప్రకటించారు.
TV9 CAMPAIGN VACCINATE ALL: కొంతమందికి సూది మందు అంటేనే భయం. కొన్ని సమూహాల్లో టీకా అంటే బోలెడు అపోహలు. మరి అందరికీ వ్యాక్సిన్ ఎలా.. కొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రకరకాల మీడియాల ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా అభ్యర్దిస్తున్నారు. ఇక టీవీ9 కూడా తమ బాధ్యతగా అందరికీ వ్యాక్సిన్ నినాదం చేపట్టింది. ఇందులో భాగంగా ముమ్మరంగా టీవీ మాధ్యమం ద్వారా ప్రచారం చేస్తోంది. అలాగే, తమిళనాడులో ఒక ప్రాంతంలో వ్యాక్సిన్ అంటే భయం తొ దూరంగా ఉన్నవారిని ప్రోత్సహించడానికి కొన్ని స్వచ్చంధ సంస్థలు కొత్త మార్గం పట్టాయి. వ్యాక్సిన్ వేయించుకోండి.. బిర్యానీ తీసుకోండి అంటూ ఉచిత తాయిలం ప్రకటించాయి. అంతేకాదు.. ఇంకా చాలా ఉన్నాయి అవేమిటో చూద్దామా..
ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడులో ఎన్నో ఉచిత పథకాలు ప్రకటిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అయితే, అదేవిధమైన కొత్త ఉచితాలను మళ్ళీ ప్రకటించారు. అదేమిటి? ఎన్నికలు అయిపోయాయి.. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మళ్ళీ ఈ ఉచితాలేమిటి? అని డౌట్ వస్తోందా? ఉచితాలు అనే మాట నిజమే. కానీ, ఈసారి ఎన్నికల కోసం కాదు. కరోనా టీకా వేసుకోవడం కోసం. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. దీంతో అక్కడ వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచి.. ప్రజలంతా టీకాలు వేసుకునేలా చేయడం కోసం ఉచిత కార్యక్రమం మొదలు పెట్టారు. టీకా వేసుకునే వారికి ఒక ప్లేట్ బిర్యానీ, మొబైల్ రీచార్జ్ కూపన్ ఫ్రీగా ఇస్తున్నారు. అంతే కాదు.. టీకా వేసుకునే వారికీ లక్కీ డ్రా కూడా పెట్టారు. ఇందులో విజేతలకు బంగారు నాణేలు, మిక్సీలు, గ్రైండర్లు, స్కూటీ, వాషింగ్ మెషీన్ వంటి వాటిని గెలుచుకునే అవకాశమూ ఉంది.
మత్స్యకారుల ఆధిపత్యంలో ఉన్న కోవళంలో 14,300 జనాభా ఉంది. వీరిలో 6,400 మంది 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారు. కానీ వారిలో ఇప్పటివరకూ 50-60 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో వ్యాక్సిన్ వేయించుకునే ఉత్సాహం పెంచడం కోసం ఎస్టీఎస్ ఫౌండేషన్, సిఎన్ రామ్‌దాస్ ట్రస్ట్ ఈ లాటరీ స్కీం పెట్టారు. ఈ విధానం వ్యాక్సిన్ పొందడానికి ప్రజలను ప్రేరేపిస్తుందని సంస్థ చెబుతోంది. వారన్నట్టుగానే ఈ ప్రకటన చేసిన తరువాత అక్కడ ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చారు. వారం రోజుల్లో 650 మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. ఇంకా 700 మందికి పైగా టీకా కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. టీకా పై తమకు అనుమానాలు ఉన్నాయనీ కానీ, ఈ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మమ్మల్ని టీకా వేసుకునేదిశాగా ప్రోత్సహిస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
కోవళం కోవిడ్ ఫ్రీగా చేయడం కోసం ఎస్టీఎస్ ఫౌండేషన్, సిఎన్ రామ్‌దాస్ ట్రస్ట్ రెండూ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న చిరాగ్ తో కలిసి పనిచేస్తున్నారు. సిఎన్ రామ్‌దాస్ ట్రస్ట్‌లోని డాన్ బాస్కో స్కూల్ 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థి తో పాటు దీనిని న్యూయార్క్‌లోని అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ రాజీవ్ ఫెర్నాండో స్థాపించారు. ఈ రెండు ట్రస్టులు నిధులను సేకరిస్తాయి. ఎస్టీఎస్ ఫౌండేషన్ ప్రాంతీయంగా ఈ రంగంలో పనిచేస్తుంది.
టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ప్రజలు తమ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని ఎస్టీఎస్ ఫౌండేషన్ ట్రస్టీ జె సుందర్ చెప్పారు , వయోజన జనాభాలో 100% టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు . టీకా లభ్యత ఆధారంగా మేము స్లాట్‌లను నింపుతున్నాము. ఉచిత బిర్యానీ ప్రజలలో ఆకర్షణగా ఉంది. మా కేంద్రం యొక్క మొత్తం వాతావరణం ఆసుపత్రిలో కంటే సరదాగా ఉంటుంది. కోవళంలోని వయోజన జనాభాలో 100% మందికి టీకాలు వేయడం, ఈ గ్రామాన్ని దేశంలో రోల్ మోడల్‌గా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు.
సిఎన్ రామ్‌దాస్ సిడి ట్రస్ట్ గిరీష్ మాట్లాడుతూ ఈ ప్రచారానికి ముందు 50-60 మందికి మాత్రమే వ్యాక్సిన్ వచ్చింది. ఈ ప్రచారం ప్రారంభం అయిన తరువాత ఒక వారంలో 650 మందికి పైగా మొదటి మోతాదుతీసుకున్నారు.750 మంది స్లాట్లు బుక్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క విజయం ఇతర గ్రామాలను అనుసంధానించడానికి మాకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
Also Read: Coronavirus Variants: మరో డేంజరస్ వేరియంట్..ఏడు రోజుల్లో వెయిట్ లాస్ !..ఇవిగో వివరాలు