Covid Vaccines Fact: వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందా..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంతా..?
వ్యాధి నిరోధక శక్తే... మనుషుల ప్రాణాలు తీస్తోందన్నది. ఇందులో నిజమెంత.. అన్నదానిపై నిపుణులు కీలక వివరణ ఇస్తున్నారు.
Fact check on Covid Vaccines: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఉత్తమ మార్గమన్న నిపుణుల సూచనల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రముఖ దేశాలన్నీ దాదాపు సగం జనాభాకు టీకా పంపిణీ పూర్తి చేశాయి. ఇటు మన దేశంలోనూ 18 ఏళ్లు పైబడిన వారికందరికీ వ్యాక్సిన్ పంపిణీ చురుకుగా సాగుతోంది.
అయితే, సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఒకటి వ్యాధి నిరోధక శక్తే… మనుషుల ప్రాణాలు తీస్తోందన్నది. ఇందులో నిజమెంత.. అన్నదానిపై నిపుణులు కీలక వివరణ ఇస్తున్నారు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే.. బ్యాక్టీరియాయే మనకు శత్రువుగా మారి.. ప్రాణాలు తీస్తే.. ఇలాంటి పరిస్థితిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ (autoimmune disease) అంటారు. అది అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఈ పరిస్థితి వస్తోందనీ… చాలా మందికి ఆటోఇమ్యూన్ ఏర్పడి… వారిలోపలి రక్షణ కవచాలుగా ఉండే బ్యాక్టీరియాయే వారి ప్రాణాలు తీస్తోందనే ప్రచారం జరుగుతోంది.
అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదు అనీ, దీన్ని నమ్మవద్దు అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొత్త అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలోకి తెచ్చింది అమెరికాలోని క్లెవ్‌లాండ్‌లో ఉండే షెర్రీ టెన్పెన్నీ. ఆమె ఫిజీషియన్. వ్యాక్సిన్లు వద్దు అని కోరుతున్న అడ్వకేట్. ఫిబ్రవరిలో ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. కొందరు వ్యాక్సిన్ వేయించుకున్నాక చనిపోతున్నారు. వ్యాక్సిన్ వేయంచుకున్నాక… 42 రోజుల తర్వాత… ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చి చాలా మంది ఆస్పత్రి పాలవుతారు. ఓ సంవత్సరం తర్వాత కూడా ఈ పరిస్థితి ఉంటుంది అని ఆమె అన్నారు
దీంతో ఆటోఇమ్యూన్ అనే పదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ చూపించలేదు. దీంతో ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఇవన్నీ ఉత్తుత్తి మాటలే అని నిపుణులు స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. ఇండియాలో ఇంతలా జనం చనిపోవడానికి… ఆటోఇమ్యూన్ జరగడమే కారణం అంటూ.. కొంతమంది నెటిజన్లను భయపెట్టేందుకు అడ్డమైన వార్తలూ… సోషల్ మీడియాలో రాస్తున్నారు. వీటిని నమ్మవద్దని డాక్టర్లు అంటున్నారు.
కరోనా వ్యాక్సిన్లు వేయంచుకోవడం వల్లే మరణాల సంఖ్య చాలా వరకూ తగ్గిందని భారతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకినా.. అది అంత తీవ్రంగా ఉండటలేదనీ… వారు కోలుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వ్యా్క్సిన్ తీసుకున్నవారిలో ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు తెలిపారు.
ఆటోఇమ్యూన్ అనేద అమెరికాలో అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది వస్తూ ఉంటుంది. అమెరికాలో 2.40 కోట్ల మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వారికి రకరకాల వ్యాధులు సోకాయి. మరో 80 లక్షల మందికి వ్యాధినిరోధక శక్తిలో ప్రతికూల మార్పులు కనిపించాయి. అయితే, వారికి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే ఇలా జరిగింది అనేందుకు ఆధారాలు లేవని పరిశోధకులు అరిస్టో వోజ్దానీ (Aristo Vojdani) తెలిపారు. ఇప్పటివరకూ ఏ వ్యాక్సిన్ వల్ల కూడా ఇలాంటి ప్రమాద పరిస్థితి రాలేదని ఫిలడెల్ఫియాలోని ఓ పిల్లల ఆస్పత్రి తెలిపింది.
సోషల్ మీడియా వేదికగా కొందరు జనాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. తాము రాసే అసత్య వార్తలను చదివి, భయపడి ప్రజలు వాటిని ఇతరులకు షేర్ చేస్తే… అది చూసి ఆనందపడే శాడిస్టిక్ మెంటాలిటీ వారికి ఉంటుంది. అలాంటి వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. వారికి సమాజ శ్రేయస్సు కంటే… ప్రజలు ఇబ్బంది పడటమే ఇష్టం. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ వార్తనూ నమ్మవద్దని డాక్టర్లు కోరుతున్నారు. ఏ సమాచారమైనా ప్రభుత్వాలు ఇస్తే లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తేనే నమ్మమని చెబుతున్నారు.