GHMC officer scandal: యువతితో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ కమిషనర్ రాసలీలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ద‌ృశ్యాలు..!

హైదరాబాద్ మహానగర మున్సిపల్‌ అధికారి, ఓ యువతితో రాసలీలలు జరిపి అడ్డంగా దొరికిపోయాడు.. ఏకంగా మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలోనే దుకాణం పెట్టాడు.. డిప్యూటీ కమిషనర్‌తిప్పర్తి యాదయ్య.

GHMC officer scandal: యువతితో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ కమిషనర్ రాసలీలు..  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ద‌ృశ్యాలు..!
Ghmc Officer Scandal, Alwal Circle Deputy Commissioner Molestation Women
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 07, 2021 | 12:16 PM

GHMC officer scandal: హైదరాబాద్ మహానగర మున్సిపల్‌ అధికారి, ఓ యువతితో రాసలీలలు జరిపి అడ్డంగా దొరికిపోయాడు.. ఏకంగా మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలోనే దుకాణం పెట్టాడు. తిప్పర్తి యాదయ్య.. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్వాల్‌ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన పెద్దగా ఎవరికీ తెలీదేమో. కానీ, ఇప్పుడు మాత్రం వెరీ పాపులర్ అయిపోయాడు. ప్రజల కోసం పనిచేసికాదు.. ఆఫీస్‌ కొచ్చి రాసలీలలు వెలగబెడుతున్నందుకు.. ! ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

తిప్పర్తి యాదయ్య.. ఓ అమ్మాయితో రాసలీలలు జరుపుతూ ఎంచక్కా ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. విచిత్రం ఏంటంటే.. నన్ను చూడు, నా గొప్పతనం చూడున్నట్లు.. ఆ ఫోటోలను ఆయనే తన వాట్సాప్ గ్రూప్స్‌లో పెట్టుకున్నాడు. అమాయకత్వంతో చేశాడా.. కావాలనే కక్షగట్టి చేశాడోగానీ యాదయ్య తీరుపై అల్వాల్‌ జీహెచ్‌ఎంసీలోనే నిప్పులు చెరుగుతున్నారు ఉద్యోగులు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరోగానీ.. హోదా, అధికారం చేతిలో ఉందికదాని అమ్మాయిలను ట్రాప్ చేయడం, వాళ్లతో ఇలా ఫోటోలు దిగడం, ఆపై వైరల్ చెయ్యడం.. ఇదెక్కడి గలీజు అలవాటు అని ప్రశ్నిస్తున్నాయి మహిళా సంఘాలు. యాదయ్యను సస్పెండ్ చేసి.. శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయిస్తున్నాయి.

Read Also…  Viral Video: యజమాని పక్కన నిద్రిస్తున్న కుక్కపిల్లను చూసి.. ఈ కుక్క ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.!