Youth Street Fight: హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్‌ వార్‌ కలకలం.. గ్రూపులుగా విడిపోయి విచక్షణారహితంగా కొట్టుకున్న యువకులు..

హైదరాబాద్ మహానగరంలో మరోసారి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. పాతబస్తీలోని డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది.

Youth Street Fight: హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్‌ వార్‌ కలకలం..  గ్రూపులుగా విడిపోయి విచక్షణారహితంగా కొట్టుకున్న యువకులు..
Hyderabad Youth Street Fight In Old City
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 07, 2021 | 11:43 AM

Hyderabad Youth Street Fight: హైదరాబాద్ మహానగరంలో మరోసారి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. పాతబస్తీలోని డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. అద్నాన్‌, వాడి గ్యాంగ్స్ రోడ్డెక్కి బాహాబాహీకి దిగారు. చంచల్‌గూడా జైలు సమీపంలోని రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొందరు యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి విచక్షణారహితంగా పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఓ చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. యువకులు ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.

అజీబ్, ముజీబ్, కమ్రాన్‌తో పాటు మరికొంత మంది చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బల ధాటికి అద్నాన్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అద్నాన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వెద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఇరువర్గాలకు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, నగరంలో రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలవుతుండగానే ఈ ఘర్షణ చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేగింది.

Read Also…  పోలీస్ స్టేషన్ లో ‘వింత ప్రొటెస్టర్’….హర్యానా రైతుల ఐడియా ఇచ్చిన ‘కిక్కే’ వేరప్పా…! దిగొచ్చిన ఖాకీలు

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే