TV9 Salutes Doctors: కరోనా కష్టంలో మొక్కవోని ధైర్యం..మహమ్మారి కాటేస్తున్నా..ఆయుధాలు లేకున్నా..మృత్యువుతో వైద్యుల పోరాటం!

TV9 Salutes Doctors: దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ పక్కన పెడితే.. కష్టం వస్తే మనం ప్రార్ధనలు చేసినా మనకు కనిపించని ఆ దేవుడు కరుణిస్తాడనే నమ్మకం లేదు. కానీ, మనకు సుస్తీ చేస్తే.. కచ్చితంగా ఆ చేతులు మనల్ని ఆదుకుంటాయి.

TV9 Salutes Doctors: కరోనా కష్టంలో మొక్కవోని ధైర్యం..మహమ్మారి కాటేస్తున్నా..ఆయుధాలు లేకున్నా..మృత్యువుతో వైద్యుల పోరాటం!
Doctors Deaths
Follow us

|

Updated on: Jun 07, 2021 | 8:21 PM

TV9 Salutes Doctors: దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ పక్కన పెడితే.. కష్టం వస్తే మనం ప్రార్ధనలు చేసినా మనకు కనిపించని ఆ దేవుడు కరుణిస్తాడనే నమ్మకం లేదు. కానీ, మనకు సుస్తీ చేస్తే.. కచ్చితంగా ఆ చేతులు మనల్ని ఆదుకుంటాయి. మన అనారోగ్యాన్ని పారదోలే వరకూ ఆ కళ్ళు నిద్రకోసం చూడవు. మన శరీరం కుదుట పడేవరకూ వారి ప్రయత్నం ఆగదు. తనను నమ్మి వచ్చిన రోగిని బ్రతికించడం కోసమే వారు తపన పడతారు. వారే మనకు కనిపించే దైవాలు. మన డాక్టర్లు. ఏ మనిషి అయినా ఓ పది గంటలు పనిచేయగలడు. లేదంటే ఒక రోజంతా నిద్రకూడా పోకుండా తను అనుకున్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించగలడు. కానీ, వారు గంటలు.. రోజులు.. వారాలు లెక్కవేయలేదు. అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది. అసలు అది ఏమిటో తెలీదు. ఎలా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందో అర్ధం కాదు. అయినా ఆ కనిపించని శత్రువుతో తమ అనుభవాన్నంతా రంగరించి ఏడాదిన్నరగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒక దేశంలో ఈ మందు పని చేస్తోంది అంటారు. మరో దేశంలో ఆ మందు ఎందుకూ పనికిరాదంటారు. పనికొచ్చిందని చెప్పిన మందు అందుబాటులో ఉండదు. కళ్ళెదుటే ప్రాణాలు విలవిలలాడుతుంటే.. వాటిని తమ అరచేతులు అడ్డుపెట్టి కాపాడటానికి విశ్వప్రయత్నం చేశారు.. చేస్తూనే ఉన్నారు. రోజుల తరబడి కాదు కాదు.. నెలల తరబడి కరోనాతో యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్రపంచమంతా భయంతో దాక్కోవలసి వచ్చింది. కానీ, వారు ఆ భయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కోరలు చాస్తున్న కరోనానుంచి కాపాడుకోవడానికి ఎవరికి వారు ఇంట్లోనే బందీలుగా బిక్కు బిక్కు మంటూ గడుపుతుంటే.. వారు మాత్రం ఆ మహమ్మారి బారిన పడి బ్రతుకు కోసం బాధపడుతున్న వారికి సేవలు చేశారు. వారు కరోనాను లెక్కచేయలేదు..తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు.. నిరంతరం కొవిడ్ రోగులకు చికిత్స అందించారు.. అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేవుడు ఎవరో తెలియకపోయినా కరోనా బాధితుల పాలిటి ప్రత్యక్ష దైవాలు మాత్రం వైద్యులే. వైద్యో నారాయనో హరీ అనే నానుడిని ప్రత్యక్షం నిజం చేసి చూపించారు. వారు అలా సేవలు చేయడానికి వారికేమీ అన్నీ సమకూరి లేవు.

‘సైనికులకు కూడా అన్ని ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి పంపుతారు. కానీ డాక్టర్లను ఏ ఆయుధాలు లేకుండానే యుద్ధం చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఇటీవల చనిపోయిన ఒక వైద్యుని కుమార్తె అడిగిన ప్రశ్న అందర్నీ ఆలోచింప చేసేదే.. ఎందుకంటే.. మందులు ఏవి వాడాలో పూర్తిగా తెలీదు. ఏ వైద్యం చేయాలనేది ఎక్కడా రాసిలేదు. ఏ రకమైన వైద్యం చేస్తే ఎటువంటి ఉపద్రవం ముంచుకు వస్తుందో తెలీదు. అసలు ఈ మహమ్మారి రోగి శరీరంలో ఎక్కడ ఎలా తిష్ట వేసిందో సరిగ్గా చెప్పగలిగే పరికరమూ లేదు. ఇక రెండో వేవ్ లో ఆక్సిజన్ కొరత. మందుల కొరత. బెడ్ల కొరత. వీటి మధ్య డాక్టర్లను నిలదీసే బాధితుల కుటుంబాలు.. ఒత్తిడి తీవ్రమైనా తమ చేతిలో స్టేత్ పాడేయలేదు. పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరులో రణరంగంలో అన్నీ కోల్పోయిన సైనికుల్లా కరోనా మహమ్మారికి దొరికిపోతున్నారు మన వైద్యులు.

మహమ్మారి విరుచుకు పడుతున్న వేళలో వైద్యులు చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వంత కుటుంబ సభ్యులు కరోనా కాటేసింది అని తెలియగానే ఆమడదూరం పారిపోతున్నారు. స్వంత మనిషే అయినా, అతని దగ్గరకు వెళితే ఏమవుతుందో అనే భయంతో బాధను దిగామింగుతూనే దూరం నుంచి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. కానీ, అది ప్రాణాంతకమైన రక్కసి అని తెలుసు. ఏమాత్రం సందు దొరికినా కబళించేందుకు సిద్ధంగా ఉంటుందని తెలుసు. అన్నీ తెలిసినా.. తన వద్దకు వైద్యం కోసం వచ్చిన వారిని అక్కున చేర్చుకుని వైద్య సహాయం అందిస్తూ వస్తున్నారు డాక్టర్లు. రోజూ పదుల సంఖ్యలో రోగులు.. ఒక్కోసారి కళ్ళెదుటే ప్రాణాలు వదిలేస్తున్న మనషులు.. అయినా గుండె రాయి చేసుకుని మొక్కవోని ధైర్యంతో కరోనా పేషెంట్స్ కి బాసటగా నిలుస్తూ వస్తున్నారు.

అటువంటి వైద్యుల ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపంలా మారిపోయాయి. వందలాది పేషెంట్స్ కి ధైర్యం చెప్పి.. వైద్యం చేసిన ఆ చేతులు జీవం కోల్పోయి సెలవు తీసుకుంటున్నాయి. ఎందరి ప్రాణాలనొ నిలబెట్టిన ఆ ప్రాణాలు ఇప్పుడు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనాను పారద్రోలడం కోసం అవిశ్రాంతంగా పోరు సలుపుతున్న వైద్యులపై కరోనా కాటు పడుతోంది. మొదటి వేవ్ వచ్చినపుడు సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా 748 వైద్యులు తమ విలువైన ప్రాణాలను కరోనాకు బలిచేసుకున్నారు. కానీ, ప్రస్తుతం రెండో వేవ్ లో కేవలం 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా మొత్తం 594 మంది వైద్యులు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు చనిపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఇక, అత్యధికంగా ఢిల్లీలో 107 మంది, బిహార్‌లో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 67 మంది వైద్యులు కరోనా బారినపడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 45 శాతం మంది వైద్యులు మృతి చెందారు. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్-43, జార్ఖండ్-39 ఆంధ్రప్రదేశ్-32, తెలంగాణ-32, పశ్చిమ బెంగాల్-25, తమిళనాడు-21, ఒడిశా-22 మరణాలు ఉన్నాయి. అత్యల్పంగా పుదుచ్చేరిలో ఒకరు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున డాక్టర్లు కొవిడ్‌తో ప్రాణాలొదిలారు. ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు, హర్యానాలో ముగ్గురు, పంజాబ్‌లో ముగ్గురు, అసోం, కర్ణాటకల్లో 8 మంది చొప్పున, మధ్యప్రదేశ్‌లో 16 మంది, మహారాష్ట్రలో 17 మంది వైద్యులు మృతి చెందినట్టు మెడికల్ అసోసియేషన్ తాజా నివేదికలో పేర్కొంది.

కొవిడ్ వేళ వైద్యుల కొరత..

తక్కువ సిబ్బంది, వైద్యుల కొరతను ఎదుర్కుంటోంది భారత్. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డబ్ల్యుహెచ్ఓ గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతీ 10వేలమంది ప్రజలకు ఉన్నక్రియాశీల ఆరోగ్య సిబ్బంది(వైద్యులు, నర్సులు, మంత్రసానులు) సంఖ్య 17 మాత్రమే. డబ్ల్యుహెచ్ఓ ప్రకారం ఈ నిష్ఫత్తి 10,000 మందికి 44.5గా ఉండాలి. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది 40 శాతం ఉండగా, అదే పట్టణాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది 60 శాతం. దేశంలో 70 శాతం ప్రజలు గ్రామాల్లో ఉంటున్నారు. ఈలెక్కన గ్రామాల్లో ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి ఉన్న నిష్పత్తిలో భారీ అంతరం ఉంది.

నిజానికి మన వైద్యులు ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. గతంలో టీవీ 9 ఈ గణాంకాలను వివరిస్తూ.. కరోనా మహమ్మారి ముంచేస్తున్నా ముందుకు ఉరుకుతున్న వైద్యుల సాహసానికి సెల్యూట్ చేస్తూ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం ఎందరినో కదిలించింది. ఈ కథనాన్ని చూసిన వైద్యుల కుటుంబాలు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. వైద్యుల ఇబ్బందుల పట్ల టీవీ9 చూపించిన శ్రద్ధకు వారంతా అభినందనలు తెలిపారు. ప్రత్యక్ష దైవాలైన వైద్యుల పరిస్థితులపై టీవీ 9 ఇచ్చిన ప్రత్యెక కథనం ఇక్కడ మీరు చూడొచ్చు.

Also Read: Megastar Chiranjeevi: రోజుకు ఐదారు వందల మంది సినీ కార్మికులకు వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము : చిరంజీవి

PM Modi Speech: : 18 ఏళ్ళు దాటిన అందరికీ ఉచిత వాక్సిన్.. మొత్తం బాధ్యత కేంద్రానిదే.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని నరేంద్రమోదీ..

Latest Articles
పెళ్లికి ఆలస్యం అవుతుందా గంగా సప్తమి రోజున ఈ చర్యలు చేసి చూడండి
పెళ్లికి ఆలస్యం అవుతుందా గంగా సప్తమి రోజున ఈ చర్యలు చేసి చూడండి
ఎన్నికల సిరా ను తయారు చేసేది మన హైదరాబాదే..
ఎన్నికల సిరా ను తయారు చేసేది మన హైదరాబాదే..
ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డ్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి ఔట్..
ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డ్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి ఔట్..
యువకుడికి రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. తెరిచి చూడగా..
యువకుడికి రోడ్డుపై దొరికిన బ్యాగ్‌.. తెరిచి చూడగా..
అత్తగారితో బంధం బలపడాలంటే మథర్స్ డేని ఇలా జరుపుకోండి
అత్తగారితో బంధం బలపడాలంటే మథర్స్ డేని ఇలా జరుపుకోండి
జాబ్‌కు సెలెక్ట్ అయ్యావని చెప్పి.. ఆపై తన బుద్ది చూపించాడు
జాబ్‌కు సెలెక్ట్ అయ్యావని చెప్పి.. ఆపై తన బుద్ది చూపించాడు
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ.. వాల్ పోస్టర్లు, కరపత్రాలు
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ.. వాల్ పోస్టర్లు, కరపత్రాలు
బెల్టుతో గొంతు బిగించి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం
బెల్టుతో గొంతు బిగించి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!