Coffee Disadvantages: మరీ ఎక్కువగా కాఫీ తాగుతున్నారా? మీకో పిడుగులాంటి వార్త… లేటెస్ట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Coffee Disadvantages for Health: రోజులో ఒకట్రెండు సార్లు కాఫీ తాగితే పర్వాలేదుకానీ..కొందరు అదే పనిగా గంటకు, రెండు గంటలకు ఒక్కో కాఫీ కప్పును లాగించేస్తుంటారు. అలాంటి వారు మోతాదుకు మించి కఫైన్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎలాంటి అనర్థాలు కలుగుతాయో..మీరు తప్పక తెలుసుకోవాలి.
రోజులో ఒకట్రెండు సార్లు కాఫీ తాగితే పర్వాలేదుకానీ..కొందరు కాఫీ ప్రియులు అదే పనిగా గంటకు, రెండు గంటలకు ఒక్కో కాఫీ కప్పును లాగించేస్తుంటారు. అలాంటి వారు మోతాదుకు మించి కఫైన్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎలాంటి అనర్థాలు కలుగుతాయో..మీరు తప్పక తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా సమస్యను ఎదుర్కొని ఉంటే…కాఫీకి కాస్త దూరంగా ఉండటమే బెటర్. దీనికి సంబంధించి వాషింగ్టన్‌కు చెందిన ఓ వైద్య నిపుణుల బృందం జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు తేలాయి. రోజూ ఎక్కువ మోతాదులో కాఫీ తాగేవారు అంధత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే నివేదిక హెచ్చరించింది. రోజూ ఎక్కువగా కఫైన్ తీసుకునే వారికి గ్లాకోమా ముప్పు ఎక్కువని మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన వైద్య నిపుణుల బృందం తన పరిశోధనలో తేల్చింది. ఈ అధ్యయనంలో తేలిన అంశాలను ‘ఆప్తమాలజీ’ అనే ప్రముఖ జర్నల్‌లో ప్రచురించారు. గ్లాకోమా బారినపడే వారిలో డైట్ – జన్యుపరమైన ప్రభావంపై తొలిసారిగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
మరీ ముఖ్యంగా జన్యుపరమైన కంటి ఒత్తిడి సమస్యను ఎదుర్కొనే వారు కఫైన్ ఎక్కువ తాగితే గ్లాకోమా రిస్క్ మూడు రెట్లు పెరిగే అవకాశముందని ఆ నివేదిక హెచ్చరించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గ్లాకోమా సమస్య ఉన్నట్లయితే…కాఫీ అలవాటును వదులుకోవడం లేదా రోజూ తీసుకునే కాఫీ మోతాదును గణనీయంగా తగ్గించుకోవడం ఉత్తమమని సూచించింది. అమెరికాలో గ్లాకోమా కారణంగా చాలా మంది అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అధ్యయన నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. గ్లాకోమా సమస్యకు ఇతర కారణాలు ఉన్నప్పటికీ…కఫైన్ ఎక్కువ తీసుకునే అలవాటు కూడా దీనికి కారణమవుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపారు. వీరు స్వల్ప లక్షణాలు లేదా ఎలాంటి లక్షణాలు లేకుండానే శాశ్వితంగా కంటి చూపు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించారు.
ఈ వైద్య నిపుణుల బృందం తమ అధ్యయనం కోసం బ్రిటన్‌లోని అతిపెద్ద బయో మెడికల్ డేటాబేస్ – యూకే బయోబ్యాంక్ సాయం తీసుకున్నారు. 2006 నుంచి 2010 వరకు గ్లాకోమా బారినపడిన దాదాపు 1,20,000 మంది హెల్త్ రికార్డులను పరిశీలించి…వీరిపై కఫైన్ ప్రభావాన్ని 39 నుంచి 73 ఏళ్ల వయస్కులైన గ్లాకోమా బాధితుల డీఎన్ఏ రికార్డులను కూడా పరిశీలించారు.
ఓ రకంగా కాఫీ ప్రియులకు ఇది చేదువార్తే. ఏదైనా పరిమితంగా తీసుకుంటే ఎలాంటి అనర్థాలుండవు. మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. కాఫీ తాగితే చురుకుతనం వస్తుందంటూ కొన్ని పరిశోధనలు తేల్చాయి. అయితే అదే పనికి కప్పులు కప్పులుగా కఫైన్ తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని తాజా యూకే అధ్యయన నివేదిక హెచ్చరిస్తోంది.
ఇవి కూడా చదవండి..
డయాబెటిస్ రోగులు, గర్భిణీలు మామిడి పళ్లు తినోచ్చా ? డాక్టర్స్ దీని గురించి చెప్పిన అసలు నిజాలు..
మీ చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారాన్ని డైట్‌లో చేర్చాలో తెలుసా..?