Jack Fruit Seeds : పనస గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! కరోనా టైంలో కచ్చితంగా తినాలి..
Jack Fruit Seeds : పండ్లలో జాక్‌ఫ్రూట్ అతిపెద్దది. ఇది వేసవిలో ఎక్కువగా పండుతుంది. జాక్‌ఫ్రూట్ విత్తనాలలో అధిక మొత్తంలో
Jack Fruit Seeds : పండ్లలో జాక్‌ఫ్రూట్ అతిపెద్దది. ఇది వేసవిలో ఎక్కువగా పండుతుంది. జాక్‌ఫ్రూట్ విత్తనాలలో అధిక మొత్తంలో ప్రోటీన్ , పిండి పదార్ధాలు ఉంటాయి. జాక్‌ఫ్రూట్‌ను శాకాహారులు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కాల్షియం, నియాసిన్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, విటమిన్లు ఎ, సి, బి 6, థియామిన్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
1. చర్మ ముడుతలు పోగొట్టాలంటే.. అందరూ యవ్వనంగా కనిపించేందుకు కనిపించిన క్రీములను రాసేస్తుంటారు. అయినా చర్మం ముడుతలు తగ్గవు. చిన్న వయసులోనే ఎంతో వయసు వచ్చిన వారి మాదిరిగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు పనస పండు తినడం ద్వారా చర్మ సౌందర్యం పెంచుకోవచ్చు. అలాగే, పనస విత్తనాలను చూర్ణం చేసి పాలతో కలిపి తీసుకుంటే ముఖంపై ముడతలు తగ్గి ప్రకాశవంతంగా మారుతుంది.
2. కంటి సమస్యలు మాయం.. ఆధునిక చదువులతో చిన్నారులకే కళ్లద్దాలు వస్తున్నాయి. టీవీ, మొబైల్, కంప్యూటర్ చూడటం వల్ల కళ్లకు ఎక్కువ ఒత్తిడి కలిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి ఆరోగ్యంపై దృష్టిపెట్టడానికి ముందు పనస గింజలను గుర్తుచేసుకోవాలి. కంటి సమస్యల పరిష్కారం కోసం మొలకెత్తిన పనస గింజలు తినాలి.
3. ఐరన్ పుష్కలం.. పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి ఐరన్ లభించి రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. రక్త వృద్ధి కూడా జరుగుతుంది. వీటిని తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుకోవచ్చు.
4. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. శరీర జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనస గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ సమస్యలతో శరీరం బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పనసపండు గింజలను ఉడికించి తింటే ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.