AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ల యాంటీబాడీల ఉత్పత్తిపై పరిశోధన.. అందులోనే యాంటీబాడీలు ఎక్కువ..!: పరిశోధకులు

Covishield Covaxin:కొవాగ్జిన్‌ కన్నా కోవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం కేవలం ప్రీప్రింట్‌ రూపంలో మాత్రమే..

కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ల యాంటీబాడీల ఉత్పత్తిపై పరిశోధన.. అందులోనే యాంటీబాడీలు ఎక్కువ..!: పరిశోధకులు
Subhash Goud
|

Updated on: Jun 07, 2021 | 9:39 PM

Share

Covishield Covaxin:కొవాగ్జిన్‌ కన్నా కోవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం కేవలం ప్రీప్రింట్‌ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అధ్యయన్నాన్ని నిపుణులు పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంది. రెండు టీకాల వల్ల రోగ నిరోధక శక్తి వైద్యులు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ .. కొవీషీల్డ్ ద్వారా యాంటీబాడీల సగటు ఉత్పత్తి స్థాయి అధికంగా ఉన్నట్టు తేలింది.

కొవాగ్జిన్‌, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీల స్థాయిలను బట్టి పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. అధ్యయనంలో భాగంగా వారు మొత్తం 552 మంది వైద్యి సిబ్బందిని పరీక్షించారు. కోవిషీల్డ్‌ తీసుకున్న 425 సిబ్బందిలో సెరోపాజిటివిటీ రేటు 98.1 కాగా, కొవ్యాక్సిన్ తీసుకున్న90 మందిలో ఈ రేటు 80.0 శాతంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా.. యాంటీ స్పైక్(స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యం చేసే)యాంటీబాడీల మీడియన్ స్థాయి(ఐక్యూఆర్) కోవీషీల్డ్ విషయంలో 127 ఏయూ/ఎమ్మెల్ కాగా..కొవాగ్జిన్‌ విషయంలో 53గా నమోదైనట్లు అధ్యయనంలో తేలింది.

ఇవీ కూడా చదవండి:

Lockdown Extends: జూన్‌ 16 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. ఆ రెండు రోజుల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌..!

TV9 War Against Fake News: కరోనా వ్యాక్సిన్ పై అపోహలు నమ్మద్దు..అనుమానం వస్తే నిపుణులతో మాట్లాడండి!