రానున్న ఏళ్లలో వాతావరణంలో పెను మార్పులు.. ముంచుకొస్తున్న ముప్పు… నిపుణుల అధ్యయనంలో షాకింగ్ డీటెయిల్స్
గ్లోబల్ వార్మింగ్ అన్న పదానికి ఇక కొత్త పదం వెతుక్కోవాలేమో ! ఇండియాలో రానున్న ఏళ్లలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించనున్నాయి. అత్యంత ప్రమాదకరమైన, తేమతో కూడిన ఎన్విరాన్ మెంట్ పరిస్థితులు ఏర్పడనున్నాయని ఓ కొత్త స్టడీ పేర్కొంది.
గ్లోబల్ వార్మింగ్ అన్న పదానికి ఇక కొత్త పదం వెతుక్కోవాలేమో ! ఇండియాలో రానున్న ఏళ్లలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించనున్నాయి. అత్యంత ప్రమాదకరమైన, తేమతో కూడిన ఎన్విరాన్ మెంట్ పరిస్థితులు ఏర్పడనున్నాయని ఓ కొత్త స్టడీ పేర్కొంది. మరికొన్ని సంవత్సరాల్లో క్లైమేట్ మానవాళి ఊహించని విధంగా మారుతుందట. భారత ఉపఖండం సరికొత్త వాతావరణ మార్పులకు లోనవుతుందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన స్టీవెన్ క్లెమెన్స్ అనే ప్రొఫెసర్ అంటున్నారు. గత కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడుతున్న రుతుపవనాల తీరు చాలా దారుణంగా మారుతుందని ఈయన ఆధ్వర్యంలోని బృందం తన సైన్స్ అడ్వాన్స్ జర్నల్ లో ఓ ఆర్టికల్ ని ప్రచురించింది. గ్లోబల్ వార్మింగ్ స్థానాన్ని ఈ సరికొత్త మార్పులు ఆక్రమిస్తాయని, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులు విపరీతంగా పెరిగిపోతాయని ఈ బృందం పేర్కొంది. వీరు బంగాళాఖాతంలోని బురద నుంచి సేకరించిన శాంపిల్స్ ను విశ్లేషించారు. రెండు నెలలపాటు శ్రమించి 200 మీటర్ల లోతున డ్రిల్ చేసి వీటిని సేకరించినట్టు ఈ బృందం పేర్కొంది. భారత ఉప ఖండం లో మునుముందు వర్షాల తాకిడి ఎలా ఉంటుందో అంచనా వేసింది. భారీ వర్షాలు, సముద్రాల్లో ఉప్పు శాతం తగ్గడం.. కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరుగుదల మొదలైనవి పూర్తిగా క్లైమేట్ చేంజ్ కి సూచికలుగా కనబడుతున్నాయని పేర్కొంది.
భారత రుతుపవనాలు దేశంలో అనేక చోట్ల వరదలకు కారణమవుతున్నాయి…భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పంటలు నీట మునుగుతున్నాయి. రైతులు కడగండ్ల పాలబడుతున్నారు.. అని వివరించిన ఈ పరిశోధక బృందం తమ రీసెర్చ్ మరింత జరగనుందని తెలిపింది. ఇప్పటినుంచే గ్లోబల్ వార్మింగ్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారాలని అభిప్రాయపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: భారత్‌లో మరో ప్రమాదకర కరోనా వేరియంట్..కొత్తరకం వైరస్ లక్షణాలు ఇవే :New Virus in India video.