TV9 CAMPAIGN VACCINATE ALL: వేగంగా సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్.. ఫలిస్తున్న టీవీ9 ‘అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం’ ప్రచారం!

TV9 CAMPAIGN VACCINATE ALL:  కరోనా కనబడని శత్రువు. అకస్మాత్తుగా సకల మానవాళి మీదా దాడిచేసిన ఓ మహమ్మారి. దానితో పోరాటం ఎలా చేయాలో తెలీని స్థితి నుంచి.. దాని పీచమణిచే బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాం. అదే కరోనా వ్యాక్సిన్.

TV9 CAMPAIGN VACCINATE ALL: వేగంగా సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్.. ఫలిస్తున్న టీవీ9 'అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం' ప్రచారం!
Tv9 Campaign Vaccinate Al
Follow us
KVD Varma

|

Updated on: Jun 07, 2021 | 10:13 PM

TV9 CAMPAIGN VACCINATE ALL:  కరోనా కనబడని శత్రువు. అకస్మాత్తుగా సకల మానవాళి మీదా దాడిచేసిన ఓ మహమ్మారి. దానితో పోరాటం ఎలా చేయాలో తెలీని స్థితి నుంచి.. దాని పీచమణిచే బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాం. అదే కరోనా వ్యాక్సిన్. అవును ఒక్క వ్యాక్సిన్ మాత్రమే కరోనాను అడ్డుకోగలదు. శరీరంలో ఊపిరి అందించే అనువులపై దాడి చేసి ఉసురు తీసే కరోనాకు టీకాతో మాత్రమే బుద్ధి చెప్పగలం. అందుకే కరోనాతో పోరాటానికి ‘అందరికీ వ్యాక్సిన్’ మాత్రమే విజయ బాట అని టీవీ9 నమ్మింది. అదే విషయాన్ని ప్రచారం చేయాలని ప్రయత్నం మొదలు పెట్టింది. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్ వర్క్ అయిన టీవీ9 తన ప్రచారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు మరింత ఊపు తేవాలని భావించింది. ఆ దిశలో ముమ్మార ప్రచారం చేస్తోంది. వ్యాక్సినేట్ ఆల్ (అందరికీ వ్యాక్సిన్) అనే నినాదంతో టీవీ9 దూసుకుపోతోంది. వ్యాక్సినేషన్ పై ప్రత్యేక కథనాలతో టీకాలు ముమ్మరంగా అందరికీ అందేలా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేట్ ఆల్ నినాదం ఉద్యమం అయింది. స్తబ్దుగా ఉన్న ప్రభుత్వ యంత్రాగంలో చలనం వచ్చింది వ్యాక్సినేషన్ వేగవంతం అయింది. దాదాపు నెల రోజుల క్రితం వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. కారణాలేమైనా వ్యాక్సిన్ ప్రక్రియకు ఒక్కసారిగా బ్రేక్ లు పడ్డాయి. అదే సమయంలో అందరికీ వ్యాక్సిన్ అంటూ టీవీ9 తీసుకొచ్చిన ప్రచారం మళ్ళీ మెల్లగా వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకోవడానికి ఉపయోగ పడింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ ప్రత్యెక డ్రైవ్ లతో వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు. మరోపక్క వ్యాక్సిన్ కొరత అధిగమించడానికి అవసరమైన అన్నిదారుల్నీ ప్రభుత్వాలు వెతుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టీకాల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. కరోనాపై యుద్ధం చేయాలంటే వ్యాక్సిన్ సరైన ఆయుధం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. టీవీ9 చేపట్టిన అందరికీ వ్యాక్సిన్ అందరికీ ఆరోగ్యం నినాదం కూడా సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలో జూన్ 4 వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది. మొదటి డోసు వ్యాక్సిన్ ఎంతమందికి అందింది? రెండో డోసు ఎంతమందికి వేశారు? తెలుగు రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమం ఎలా సాగుతోంది.. ఈ వివరాలన్నిటినీ ఇక్కడ చూడొచ్చు..