పాస్ పోర్టులతో ఇక ‘కోవిన్ సర్టిఫికెట్ల ‘ లింక్……విదేశాలకు వెళ్లే విద్యార్థులు, టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లే అథ్లెట్లకు కేంద్రం’ తాయిలాలు'[
విదేశాల్లో చదువుకునేందుకు, ఉద్యోగం సంపాదించేందుకు, అలాగే టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లకు వ్యాక్సినేషన్ కి సంబంధించి కేంద్రం కొత్త విధానాన్ని ప్రకటించింది. వీరి పాస్ పోర్టులకు 'కోవిన్ సర్టిఫికెట్లు' జత చేస్తే చాలునని, కోవీషీల్ద్ వ్యాక్సిన్ టైప్ తప్ప మిగిలినవి అక్కరలేదని
విదేశాల్లో చదువుకునేందుకు, ఉద్యోగం సంపాదించేందుకు, అలాగే టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లకు వ్యాక్సినేషన్ కి సంబంధించి కేంద్రం కొత్త విధానాన్ని ప్రకటించింది. వీరి పాస్ పోర్టులకు ‘కోవిన్ సర్టిఫికెట్లు’ జత చేస్తే చాలునని, కోవీషీల్ద్ వ్యాక్సిన్ టైప్ తప్ప మిగిలినవి అక్కరలేదని స్పష్టం చేసింది. పైగా రెండుడోసుల మధ్య విరామ కాలాన్ని తగ్గిస్తున్నట్టు కూడా పేర్కొంది. వీరికి వ్యాక్సినేషన్ లో మొదట ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ ఇదివరకే అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వీరికి సాధ్యమైనంత త్వరగా టీకామందులు ఇచ్చేలా చూడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా టోక్యో ఒలంపిక్స్ కి వెళ్లే అథ్లెట్లతో బాటు వారి కోచ్ లకు, సంబంధితులను కూడా విస్మరించరాదన్నారు. కోవీషీల్డ్ రెండో డోసు తీసుకోవడానికి అనుమతినిచ్చేందుకు ప్రతి జిల్లాలోనూ కాంపిటెంట్ అథారిటీని నియమించాలని కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాలకు కేంద్రం సూచించింది.
ఇక విదేశాలకు వెళ్లే విద్యార్థులు మొదట వివిధ రాష్ట్రాల్లో అప్పుడే ఆయా కోవిద్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా అమెరికాలో త్వరలో అకడమిక్ సెమిస్టర్ స్టడీస్ మొదలు కానుంది. వీరికోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా వివిధ చోట్ల ఈ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఇక జపాన్ లోని టోక్యోలో జులై 23 నుంచి ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సుమారు 100 మంది అథ్లెట్లు వాటిలో పాల్గొనడానికి క్వాలిఫై అయ్యారని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వందమంది కూడా క్వాలిఫై కాగలుగుతారని వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: మాచవరంలో మంటగలిసిన మానవత్వం.. భర్త దహన సంస్కారాలు చేసిన భార్య : Viral Video.
భారత్‌లో మరో ప్రమాదకర కరోనా వేరియంట్..కొత్తరకం వైరస్ లక్షణాలు ఇవే :New Virus in India video.