Lockdown Extends: జూన్ 16 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. ఆ రెండు రోజుల్లో సంపూర్ణ లాక్‌డౌన్..!
Lockdown Extends: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కంటే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం..
Lockdown Extends: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కంటే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక కేరళలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్‌ను జూన్ 16 తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ నియంత్రణలో భాగంగా ఈనెల 12,13 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిత్యావసరాల దుకాణాలు, పరిశ్రమలకు ముడి పదార్థాలు అందించే అవుట్‌లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, బ్యాంకులు యధావిధిగా అనుమతిస్తామని వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ చేపడతామని, కేంద్రమే వ్యాక్సిన్స్‌ను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతించారు. సరైన సమయంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారని అన్నారు.