AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Benefits: రోజుకు ఒక ఆపిల్ తింటే.. ఆస్పత్రికి వెళ్లే అవసరం రాదా? ఆపిల్ తింటే అన్ని ప్రయోజనాలా? నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Apple Benefits: 'రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడితో అవసరమే లేదు’ అనే పదం మొదట 1913 లో ఉపయోగించబడింది. అయితే ఈ పదానికి...

Apple Benefits: రోజుకు ఒక ఆపిల్ తింటే.. ఆస్పత్రికి వెళ్లే అవసరం రాదా? ఆపిల్ తింటే అన్ని ప్రయోజనాలా? నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Apples
Shiva Prajapati
|

Updated on: Jun 08, 2021 | 5:26 AM

Share

Apple Benefits: ‘రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడితో అవసరమే లేదు’ అనే పదం మొదట 1913 లో ఉపయోగించబడింది. అయితే ఈ పదానికి 1866 నాడే ఉందని తెలుస్తోంది. ఆపిల్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అనేక పరిశోధనలు జరిగాయి. వాటిని అంగీకరించడం కూడా జరిగింది. కానీ, ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే నిజంగా వైద్యుడిని దూరంగా ఉంచుతుందా? ఇతర రకాల పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారం కంటే ఈ పండు యొక్క ప్రత్యేకత ఏంటి? మీ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది అనువైనదా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రోజూ తాజా పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య బాధలను తప్పిస్తుందని పరిశోధకులు చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆపిల్ పండ్లు తినడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఒకగూరుతాయంటున్నారు. ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తాయంటున్నారు. ఆపిల్స్‌లో ముఖ్యంగా వాటి తొక్కలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణజాల నష్టాన్ని నివారిస్తాయి. శరీరాన్ని క్యాన్సర్, హృదయ సంబంధిత, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. ఆపిల్స్‌లో ఉండే ఫ్లెవనాయిడ్లు అలెర్జీ, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

ఆపిల్ పండ్ల ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. వాటి పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఫిన్లాండ్‌లో జరిపిన ఒక పరిశోధనలో 9,200 మంది పురుషులు, మహిళల్లో ఆపిల్ తినడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గే అవకాశం ఉందని తేల్చారు. ఆపిల్ పండ్లు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని నిర్ధారించారు. ఆపిల్‌లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు గుండె జబ్బులను దరిచేరనీయకుండా కాపాడుతున్నాయని తేల్చారు. ఫిన్లాండ్‌కు చెందిన మరికొందరు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లోనూ ఇదే విషయం తేటతెల్లం అయ్యింది. ఆపిల్ తినడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం బయటపడొచ్చునని పేర్కొన్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. అనేక ఇతర ఆహార పదార్థాలు కూడా యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఆపిల్ పండ్ల మాదిరిగానే ప్రయోజనాలను అందిస్తాయి. కాఫీ, బ్లాక్ టీ, బ్లూబెర్రీస్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఆపిల్ యొక్క పోషక ప్రయోజనాలు చాలావరకు వాటి చర్మం నుండి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల మీ ఆరోగ్య పుష్టిగా ఉంటుంది. అదే సమయంలో ప్రతీ రోజూ ఎక్కువ ఆపిల్స్ తిన్నట్లయితే.. జీర్ణ సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also read:

Google fined: గూగుల్‌కు భారీ షాక్.. రూ.1,951 కోట్ల ఫైన్​.. ఎవరు వేశారో తెలుసా..

ఇవాళ మంత్రివర్గ సమావేశం.. తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ.. కీలక నిర్ణయాలు ప్రకటించనున్న సీఎం కేసీఆర్