AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Feeding: పిల్లలకు పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా ఈ ఐదు ఆహారాలు తినకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Feeding: నవజాత శిశువుకు తల్లి పాలు అమృతం లా పరిగణించబడతాయి. ఒక బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. తల్లి పాలు ఇవ్వడం శ్రేయస్కరం...

Feeding: పిల్లలకు పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా ఈ ఐదు ఆహారాలు తినకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Mother
Shiva Prajapati
|

Updated on: Jun 08, 2021 | 5:42 AM

Share

Feeding: నవజాత శిశువుకు తల్లి పాలు అమృతం లా పరిగణించబడతాయి. ఒక బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. తల్లి పాలు ఇవ్వడం శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణుల చెబుతుంటారు. తల్లి తన బిడ్డకు పాలిచ్చే సమయంలో ఆక్సిటాక్సిన్ అనే హార్మోన్ శరీరంలో విడుదలవుతుంది. ఇది శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. తల్లి, బిడ్డల బంధాన్ని మరింత పెంచుతుంది. అయితే, తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే.. పైన చెప్పుకున్నట్లుగా చిన్నారికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. తినకూడని పదార్థాలు తింటే.. శిశువు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్న వైద్యులు. మరి పిల్లలకు పాలిచ్చే తల్లులు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

గోధుమ: గోధుమలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కొన్నిసార్లు నవజాత శిశువులకు హాని చేస్తుంది. అందుకే నిపుణులు ఈ మహిళలను గోధుమలు తినవద్దని సలహా ఇస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తల్లి పాలిచ్చే శిశువు యొక్క మలంలో రక్తం కనిపిస్తే అది గ్లూటెన్ ఎఫెక్ట్ వల్లే కావొచ్చు. దీనికితోడు.. వారికి కడుపు నొప్పి, చిరాకు కూడా వచ్చే అవకాశం ఉంది.

సిట్రస్ పండ్లు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ సి కలిగిన సిట్రస్ పండ్లు తినడం గానీ, వాటి జ్యూస్ తాగడం గానీ పాలిచ్చే మహిళలకు తగినది కాదు. తల్లి ఈ పండ్లను తినడం వలన పాలలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఈ ఆమ్లం డిహెచ్ తో పాటు పిల్లల శరీరంలోకి వెళుతుంది. ఇది పిల్లల్లో కడుపు నొప్పి, విరేచనాలు, చిరాకు కలిగించే ఛాన్స్ ఉంది.

వెల్లుల్లి: పాలిచ్చే మహిళలకు వెల్లుల్లి తినడం ప్రమాదకరం ఏమీ కాదు. కానీ, ఉండే అల్లిసిన్ అనే మూలకం వాసన పిల్లలను ఇబ్బందికి గురి చేస్తుంది. ఒక తల్లి వెల్లుల్లి తింటే.. ఈ వాసన తల్లి పాలలో కూడా కనబడుతుంది. అలా వాసన వచ్చే పాలను పిల్లలు తాగేందుకు ఇష్టపడకపోవచ్చు. అలా శిశువు పాలు తాగకుండా మానేయడం ప్రారంభిస్తారు.

క్యాబేజీ: ఈ కూరగాయను తినడం ద్వారా మహిళల్లో గ్యాస్, గుండెల్లో మంట సమస్య తలెత్తుతుంది. దీంతో పాటు, శిశువులో కూడా జీర్ణ సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. ఇవి కాకుండా ముల్లంగి, కిడ్నీ బీన్స్, గ్రామ్, చిక్‌పీస్, కాయధాన్యాలు, బంగాళాదుంపలు, వేరుశెనగ, మొక్కజొన్న తినడం వల్ల కూడా గ్యాస్ వస్తుంది.

కాఫీ: కాఫీలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యానికి హానికరం. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి, చిరాకు కలుగుతుంది. అందువల్ల కాఫీ తాగకపోవడం ఉత్తమం.

Also read:

Banks Privatization: మరో సంచలనం దిశగా కేంద్రం అడుగులు!.. ఎస్‌బిఐని కూడా ప్రైవేటీకరించబోతున్నారా?..