AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పెరుగుతో పాటు ఈ పదార్థాలను కూడా తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఇవిమాత్రం అస్సలు తినకండి..

Health Tips: పెరుగులో విటమిన్ బి -2, విటమిన్ బి -12, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా...

Health Tips: పెరుగుతో పాటు ఈ పదార్థాలను కూడా తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఇవిమాత్రం అస్సలు తినకండి..
Curd
Shiva Prajapati
| Edited By: Phani CH|

Updated on: Jun 08, 2021 | 9:44 AM

Share

Health Tips: పెరుగులో విటమిన్ బి -2, విటమిన్ బి -12, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ని గనణీయంగా పెంచుతుంది. వేసవిలో పెరుగు ఎక్కువగా తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. అయితే, పెరుగుతో తినే సమయంలో కొన్ని పదార్థాలు తినొద్దని మీకు తెలుసా? అలా తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వేసవి కాలంలో.. తాజా పెరుగు లేదా మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. పెరుగులో జీర్ణక్రియను మెరుగు పరిచే ప్రోబయోటిక్ అంశాలు ఉంటాయి. పెరుగులో విటమిన్, విటమిన్ బి -2, విటమిన్ బి -12, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పెరుగు జీర్ణవ్యవస్థ, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో పెరుగు ఎక్కువగా తినడానికి కారణం ఇదే. కానీ పెరుగుతో తినడానికి హాని కలిగించే కొన్ని ఆహారాలు ఉన్నాయి.

పెరుగు తిన్న వెంటనే ఆయిల్ ఫుడ్‌ తినొద్దు.. పెరుగుతో ఫుడ్ తిన్న వెంటనే.. ఎక్కువ నూనె, నెయ్యితో తయారుచేసిన ఆహారాన్ని, వేపుళ్లు, ఇతర ఫ్రై వంటకాలు తినకూడదు. ఇవి మీ జీర్ణక్రియను తగ్గిస్తాయి. అజీర్తికి కారణమవుతాయి. మీ ఆరోగ్యం మందగిస్తుంది.

చేపలు, పెరుగు కలిసి తినడం మానుకోండి.. ఆయుర్వేదం ప్రకారం, ఒకే సమయంలో బహుళ ప్రోటీన్ పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. చేపలు, పెరుగు రెండింటిలోనూ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ ఒకే సమయంలో తీసుకోవడం వలన అజీర్తి, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు, పెరుగును ఎప్పుడూ కలిసి తినకూడదు.. పాలు, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, విరేచనాలు, ఉబ్బరం వస్తుంది. పాలు, పెరుగులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ ఆహారాన్ని ఒకే సమయంలో తినకుండా ఉండమని నిపుణులు సలహా ఇస్తారు.

మామిడి, పెరుగును ఒకేసారి తినకూడదు.. పెరుగు, మామిడితో వివిధ రుచికరమైన జ్యూస్‌లు తయారు చేస్తారు. మామిడి, పెరుగుతో తయారు చేసిన జ్యూస్‌లను చాలా మంది ఇష్టపడుతారు. కానీ, ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. పెరుగు తిన్న వెంటనే మామిడి పండ్లు తినడం లేదా రెండు కలిపి తినడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. అలా చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

సిట్రస్ పండ్లతో పెరుగు తినడం హానికరం.. సిట్రస్ పండ్లను పెరుగుతో తినకూడదు. ఇది వివిధ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఈ కారణంగా, రెండింటినీ కలిపి జీర్ణించుకోవడం కష్టం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంతిమంగా మలబద్దకం, అజీర్తి, విరేచనాలు వంటి ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Also read:

Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..