Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Old Currency Notes: డీమోనిటైజేషన్‌ పేరుతో భారతదేశంలో అప్పటి వరకూ చెలామణిలో ఉన్న పాత రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం..

Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..
Currency Note
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 08, 2021 | 6:01 AM

Old Currency Notes: డీమోనిటైజేషన్‌ పేరుతో భారతదేశంలో అప్పటి వరకూ చెలామణిలో ఉన్న పాత రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన తరువాత ఈ నోట్లు ఎందుకూ పనికిరాకుండా.. కేవలం చిత్తు పేపర్లుగా మాత్రమే మిగిలిపోయాయి. అయితే, ఈ చిత్తు పేపర్లే ఇప్పుడు భారీ ఎత్తున సొమ్ము సంపాదించి పెడుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

8 నవంబర్ 2016 న, భారతదేశంలో అకస్మాత్తుగా డీమోనిటైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఒక్క ప్రకటనతో అప్పటి వరకు చెలామణిలో ఉన్న పెద్దనోట్లు పూర్తి రద్దు అయిపోయాయి. అప్పటి నుంచి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చాయి. దాంతో పాత నోట్లు పనికిరాకుండా పోయాయి. అయితే, కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లకు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్ వస్తోంది. అవే భారీ ఎత్తున క్యాష్ చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. మీ వద్ద పాత నోట్లు ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. పాత నోట్లతో డబ్బులా? అని ఆశ్చర్యపోకండి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో కరెన్సీ నోట్లను ఆర్‌బిఐ ముద్రిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ప్రతీ నోటును ఎంతో జాగ్రత్తగా ముద్రిస్తారు. నోట సైజ్, దానిపై అంకెలు, ఇతర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తూ కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. అయితే, ఒక్కోసారి ముద్రణ సందర్భంగా చిన్ని చిన్న పొరపాట్లు చోటు చేసుకుంటాయి. తెలియకుండానే ఆ నోట్లు చెలామణిలోకి వచ్చేస్తాయి. అలా వాడకంలోకి వచ్చిన నోట్లు ఇప్పుడు స్పెషల్ నోట్లుగా చెలామణి అవుతున్నాయి. ఆ స్పెషల్ నోట్లకు ఇప్పుడు భారీ డిమాండ్ వస్తోంది.

ఇంతకీ స్పెషల్ నోట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్బీఐ ముద్రణ సమయంలో పొరపాటు.. ఒక నోట్‌పై క్రమ సంఖ్య రెండుసార్లు ముద్రించడం జరుగుతుంది. మరొక పొరపాటు ఏంటంటే.. నోట్ల ముద్రణ సమయంలో ఒక నోటు అంచున ఎక్కువ పేపర్ రావడం వంటికి అరుదుగా జరుగుతుంటాయి. అలా అదనపు పేపర్ ఆ నోటుకు వచ్చినట్లయితే.. అలాంటి నోట్లు మీ వద్ద ఇప్పటికీ ఉన్నట్లయితే మీ పంట పండినట్లే. ఎందుకుంటే.. ఇలాంటి స్పెషల్ నోట్లకు మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉంది. వీటిని ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టొచ్చు. ఈ నోట్లు రూ. 5 నుంచి రూ. 10 వేల వరకు అమ్ముడుపోతున్నాయి.

ఇలా అమ్మండి.. స్పెషల్ నోట్లను సేకరించడం చాలా మందికి ఇష్టం. అలా ఈ నోట్లు ఎక్కడ లభ్యమైనా వారు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ స్పెషల్ నోట్లను oldindiancoins.com లో విక్రయిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి స్పెషల్ కరెన్సీని సేకరించడం ఇష్టం అయితే, ఈ సైట్‌లో మీరు కూడా కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ప్రింటింగ్‌ తప్పు ఉన్న కరెన్సీ నోట్లు గనుక మీవద్ద ఉంటే.. మీరు ఇండియమార్ట్ లేదా ఈబే వంటి సైట్లలో కూడా వాటిని విక్రయించవచ్చు. ఇలా ఉపయోగమని నోట్లు మీకు డబ్బు సంపాదించిపెడతాయన్నమాట.

Also read:

Feeding: పిల్లలకు పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా ఈ ఐదు ఆహారాలు తినకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..